For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీ: బిట్ కాయిన్ డౌన్ కానీ.. అయిదేళ్లలో లక్ష డాలర్లకు

|

క్రిప్టో కరెన్సీ లేదా డిజిటల్ కాయిన్ పతనం కొనసాగుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ 42,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లతో పోలిస్తే ఇది 28,000 డాలర్ల వరకు తక్కువగా ఉంది. అంటే ఆల్ టైమ్ గరిష్టంతో 40 శాతానికి పైగా పతనమైంది. బిట్ కాయిన్ నవంబర్ 2021న 69,000 డాలర్ల స్థాయికి చేరుకుంది. కానీ గత కొద్ది రోజులుగా భారీ క్షీణతను నమోదు చేస్తోంది. బిట్ కాయిన్ క్రితం సెషన్లో 0.19 శాతం లేదా 77.30 డాలర్లు క్షీణించి 41,6.7 డాలర్ల వద్ద ముగిసింది.

వరల్డ్ రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం సెప్టెంబర్ 30వ తేదీ ఆల్ టైమ్ గరిష్టంతో 9 శాతం మేర పడిపోయింది. అయితే క్రితం సెషన్‌లో స్వల్పంగా పెరిగింది. ఎథేరియం చివరి సెషన్‌లో 0.27 శాతం ఎగిసి 3098 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర డిజిటల్ టోకెన్స్ కూడా భారీగానే నష్టపోయాయి. 2021 క్యాలెండర్ ఏడాదిలో బిట్ కాయిన్ అరవై శాతం మేర లాభపడింది. ఎథేరియం భారీగానే లాభపడింది. ఇక 2021లో బియాన్స్ కాయిన్ అయితే ఏకంగా 1300 శాతం లాభపడింది.

Crypto Crash: Goldman Sachs Reveals Huge Bitcoin Price Prediction

యూఎస్ ఫెడ్ రిమార్క్స్ నేపథ్యంలో బిట్ కాయిన్ నెలల కనిష్టానికి పడిపోయింది. బిట్ కాయిన్ గతవారం 47,000 డాలర్ల వద్ద ప్రారంభమై, ప్రస్తుతం 42,000 డాలర్ల దిగువకు పడిపోయింది. 2022 బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోలు భారీ నష్టంతో ప్రారంభమయ్యాయి. అయితే బిట్ కాయిన్ వచ్చే అయిదేళ్లలో 1,00,000 డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది.

English summary

భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీ: బిట్ కాయిన్ డౌన్ కానీ.. అయిదేళ్లలో లక్ష డాలర్లకు | Crypto Crash: Goldman Sachs Reveals Huge Bitcoin Price Prediction

Goldman Sachs has predicted bitcoin will increasingly compete with gold as a store of value and could hit $100,000 within five years.
Story first published: Sunday, January 9, 2022, 21:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X