అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. 2019-20 ఏడాదికి కాను ప్రధానమంత్రి ఫసల్ బీమా, పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీ నుంచి పంటల బీమాను 100% రాష్ట్ర ప్రభుత్వ పథకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది.

100% బీమా ప్రీమియం
ఈ జీవో ప్రకారం ఏపీలోని నిర్దేశించిన ప్రాంతాల్లో పంటల బీమా కోసం వ్యవసాయ శాఖ గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుదారులందరికీ 100% బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. పరిహారం సొమ్ము వారి ఖాతాలకు చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.

ఏపీ జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్
అంతేకాదు, పంటల బీమా పథకం అమలు కోసం ఏపీ జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే జీవో ఇచ్చింది. ఈ కార్పోరేషన్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 కంపెనీల చట్టానికి అనుగుణంగా రూ.101 కోట్ల వాటా ధనంతో ప్రభుత్వ సొంత పంట బీమా సంస్థ ఏర్పడుతుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది.

రైతులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు
ఏపీ సాధారణ బీమా సంస్థకు సంబంధించి విధివిధానాలు కూడా విడుదలయ్యాయి. పంటల బీమా, పరిహారం చెల్లింపు అంశాలను ఈ సంస్థనే చెల్లిస్తుంది. పంటల బీమాకు సంబంధించి రైతులు ఏ ఏజెన్సీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పంట నష్టపోతే సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పరిహారం జమ చేస్తుంది. ఆధార్‌తో అనుసంధానమైన ఖాతాల్లోకి పరిహారం క్రెడిట్ అవుతుంది.

ఇది ఎలా...
- గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది ఉమ్మడిగా పరిశీలించి సాగుదారుల వివరాలను గడువులోగా వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయాలి.
- పంట నష్టం, పరిహారం చెల్లింపు అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల కింద ఇప్పటికే ఉన్న నియమ నిబంధనలను వర్తింపచేస్తారు.
- పంటల బీమా అమలు, పర్యవేక్షణ, పంట కోత ప్రయోగాలు, పరిహారం అందించడం వంటి అంశాలపై వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
- పంట నష్టపోతే అర్హులైన రైతులకు సాధ్యమైనంత త్వరగా న్యాయపరిహారం అందించాలి.

అందుకే సొంత బీమా సంస్థ..
రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించింది. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలో ఉచిత పంటల బీమాను అమలు చేయాలని ఇదివరకే నిర్ణయించింది. దీంతో రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటాను ప్రభుత్వమే బీమా సంస్థలకు చెల్లిస్తోంది. అయితే బీమా సంస్థల కంటే సొంతగా బీమా సంస్థను ఏర్పాటు చేస్తే రైతులకు వెనువెంటనే పరిహారం చెల్లించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రూ.101 కోట్లతో సొంత బీమా సంస్థను నెలకొల్పుతోంది. దీనిని రబీ నుంచి అమలులోకి తెస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications