For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ

|

adani bonds: ఈ ఏడాది అదానీ గ్రూపుకి ఏమాత్రం కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. కోటి ఆశలతో FPO లాంచ్ చేయాలని చూడగా.. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ పలు ఆర్థిక ఆరోపణలు చేసింది. రెండు రోజుల పాటు FPO సబ్ స్క్రిప్షన్ సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. ఇక ఇది ఫెయిల్ అయింది అనుకునే సమయానికి అదానీ మాయ బాగా పనిచేసింది. తీరా ముగిసే సమయానికి ఓవర్ సబ్‌ స్క్రైబ్ అయింది. ఇంత జరిగినా.. ఆ నివేదిక ఎఫెక్ట్ నుంచి మాత్రం గ్రూపు కంపెనీలు బయటపడలేదనడానికి క్రెడిట్ సుస్సీ తాజా ప్రకటనే నిదర్శనం.

ఆ బాండ్లు స్వీకరించం

ఆ బాండ్లు స్వీకరించం

అదానీ గ్రూపు బాండ్లపై స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంకింగ్ కంపెనీ క్రెడిట్ సుస్సీ తన క్లయింట్లకు కీలక సూచనలు చేసింది. ప్రైవేట్ బ్యాంకింగ్ క్లయింట్‌లకు మార్జిన్ లోన్‌ కోసం పూచీకత్తుగా ఈ బాండ్లు స్వీకరించడాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల అనంతరం.. గౌతమ్ అదానీ ఆర్థిక వ్యవహారాలపై లోతుగా పరిశీలన జరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఇతర బ్యాంకులకు నో అబ్జెక్షన్

ఇతర బ్యాంకులకు నో అబ్జెక్షన్

అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ ద్వారా విక్రయించబడిన బాండ్లకు క్రెడిట్ సుస్సీ జీరో లెండింగ్ విలువను కేటాయించిందని బ్లూమ్‌బెర్గ్ ఏజెన్సీ నివేదించింది. కాగా ఇతర బ్యాంకులు అదానీ బాండ్లపై రుణాలు ఇవ్వడం కొనసాగిస్తున్నాయంది. అదానీ పోర్ట్స్ డాలర్ బాండ్‌లపై 75 నుంచి 80 శాతం మధ్య రుణం ఇవ్వడానికి రెండు యూరోపియన్ ప్రైవేట్ బ్యాంకులు గతంలో మాదిరిగానే కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.

సంస్థాగత పెట్టుబడిదారుల దన్నుతో..

సంస్థాగత పెట్టుబడిదారుల దన్నుతో..

ఓ కంపెనీ బాండ్ల రుణ విలువను ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ సున్నాకి తగ్గిస్తే.. క్లయింట్లు సాధారణంగా నగదు లేదా మరో విధంగా తాకట్టును టాప్ అప్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే, వారి సెక్యూరిటీలను లిక్విడేట్ చేయవచ్చు. హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణల తర్వాత గ్రూప్ బాండ్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి. కానీ ఇప్పటికే ఉన్న వాటాదారులు, సంస్థాగత పెట్టుబడిదారుల మద్దతుతో 2.5 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని పూర్తి చేసి కొంతమేర నష్టాల నుంచి గట్టెక్కింది. అయితే ఇప్పుడు క్రెడిట్ సుస్సీ నిర్ణయం మాత్రం కొంత ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

English summary

adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ | Credit suisse halts accepting adani bonds for margin loans

Adani bonds value sink..
Story first published: Wednesday, February 1, 2023, 20:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X