For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డులు జూమ్, భారీగా పెరిగిన వినియోగం: కొన్ని రంగాల్లోని వారికి కార్డ్స్ కష్టంగా..

|

ఢిల్లీ: కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ఉత్పత్తులు కొనుగోళ్లు చేయడానికి ఆన్‌లైన్ పేమెంట్స్ లేదా కార్డ్స్ ఆకర్షణీయమైన లేదా అవసరమైన ఎంపికలు మారాయి. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది మార్చి చివరి వారంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో రెన్యూవల్ లేకపోవడంతో ఆ నెలలో గణనీయంగా తగ్గిన క్రెడిట్ కార్డ్స్ వినియోగం అన్-లాక్ తర్వాత దశలవారీగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి దాదాపు సాధారణ పరిస్థితికి వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ నెలతో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో క్రెడిట్ కార్డు దరఖాస్తులు పెరిగాయి.

పెద్ద బ్యాంకులు సరే.. సేవింగ్స్ అకౌంట్‌పై ఈ బ్యాంకులు మంచి ఆఫర్పెద్ద బ్యాంకులు సరే.. సేవింగ్స్ అకౌంట్‌పై ఈ బ్యాంకులు మంచి ఆఫర్

క్రెడిట్ కార్డ్స్ వినియోగం

క్రెడిట్ కార్డ్స్ వినియోగం

కరోనా నేపథ్యంలో జూలై 2020 నాటికి ఏడాది ప్రాతిపదికన క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్స్ 32 శాతం పెరిగాయి.

క్రెడిట్ కార్డ్ ఎంక్వయిరీ వ్యాల్యూమ్ ఏప్రిల్ 2020లో భారీగా క్షీణించిన తర్వాత అక్టోబర్‌లో ఏడాది ప్రాతిపదికన 106 శాతం పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్స్ వినియోగం పెరుగుతోంది.

సంప్రదాయ నగదు ఆధారిత, మెట్రోయేతర ప్రదేశాల్లోను క్రెడిట్ కార్డ్స్‌కు ఆదరణ లభిస్తోంది.

అక్టోబర్ 2020లో నాన్-మెట్రోల్లో విచారణ వ్యాల్యూమ్స్ 23 శాతం పెరగగా, మెట్రో ప్రాంతాల్లో 10 శాతం క్షీణించాయి.

విచారణ స్థాయిలు ప్రోత్సాహకరంగా

విచారణ స్థాయిలు ప్రోత్సాహకరంగా

క్రెడిట్ కార్డ్స్ విచారణ వ్యాల్యూమ్స్ ఏప్రిల్‌లో తగ్గినప్పటికీ, ఇటీవల ప్రోత్సాహకరంగా ఉన్నాయని, క్రెడిట్ కార్డ్స్ విచారణ స్థాయిలు పూర్తిస్థాయిలో కోలుకున్న దశకు చేరుకున్నాయని చెబుతున్నారు. పండుగ సీజన్, డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరగడం వంటి కారణాలతో ఆశాజనకంగా ఉందని ట్రాన్స్ యూనియన్ సిబిల్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అభయ్ కేల్కార్ అన్నారు.

క్రెడిట్ కార్డ్స్ ఒరిజినల్ వ్యాల్యూమ్ క్రమంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. 2019 జూలైతో పోలిస్తే 2020 జూలైలో 37 శాతం పెరిగాయి. ఏప్రిల్ 2019తో పోలిస్తే మాత్రం ఈ ఏప్రిల్‌లో 9 శాతం తగ్గాయి.

క్రెడిట్ కార్డుల జారీ

క్రెడిట్ కార్డుల జారీ

ఇక, తొలి అర్ధ భాగంలో ఎస్బీఐ మొత్తం 4.6 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేసింది. ప్రయివేటురంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 4.8 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకు 1.6 లక్షల కార్డులను జారీ చేసినట్లు ఆర్బీఐ డేటా వెల్లడిస్తోంది. ఇదిలా ఉండగా, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకపోవడమే కాకుండా కొన్ని బ్యాంకులు తాము ఇప్పటికే జారీ చేసిన పాత క్రెడిట్ కార్డుల క్రెడిట్ లిమిట్‌ను తగ్గించిన సందర్భాలు ఉన్నాయట. పరిశ్రమలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోవడంతో ఉద్యోగం కోల్పోతే తిరిగి చెల్లించే స్థోమత తగ్గుతుందని భావిస్తున్నాయట. కరోనా కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు కూడా ముందుకు రావడం లేదట. ఎయిర్ లైన్స్, ఫైనాన్స్, రియాల్టీ, మీడియా రంగాల్లోని వారికి జారీకి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నాయని చెబుతున్నారు.

English summary

క్రెడిట్ కార్డులు జూమ్, భారీగా పెరిగిన వినియోగం: కొన్ని రంగాల్లోని వారికి కార్డ్స్ కష్టంగా.. | Credit card inquiry volumes recovered fully from April 2020

Social distancing rules and lockdowns have forced consumers to rethink how they spend, with digital payments becoming an increasingly attractive, or even necessary, option in order to transact and make purchases in a virtual environment. This shift in consumer mindset is reflected in the growth observed in outstanding balances.
Story first published: Friday, December 18, 2020, 14:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X