For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన ట్రావెల్ బిల్స్, పెరిగిన కమ్యూనికేషన్ వ్యయం, ఆ టాప్ 3 కంపెనీల ఖర్చుల వివరాలివే..

|

కరోనా వైరస్ వల్ల ఐటీ కంపెనీల ప్రయాణ ఖర్చుల తగ్గిపోయాయి. కానీ కమ్యూనికేషన్ ఖర్చులు మాత్రం గణనీయంగా పెరిగాయి. కాల్స్, నెట్ కోసం కంపెనీలు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఇతర కంపెనీలు ప్రయాణ బిల్లులు తగ్గిపోయాయి. కానీ జూన్ త్రైమాసికానికి 86 శాతం ట్రావెల్లింగ్ ఎక్స్‌పెన్సెస్ తగ్గాయంటే అర్థం చేసుకోవచ్చు. అయితే కమ్యూనికేషన్ బిల్స్ మాత్రం 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి.

భారీగా తగ్గిన 3 కంపెనీల వ్యయం

భారీగా తగ్గిన 3 కంపెనీల వ్యయం

గతేడాది జూన్‌లో మూడు కంపెనీలు (విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్) ట్రావెలింగ్ కోసం రూ.2153 కోట్లను వెచ్చించింది. కానీ ఏడాది జూన్ త్రైమాసికంలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. కరోనా వైరస్ వల్ల వర్క్ ఫ్రం హోం చేయడం, జూమ్, ఇతర నెట్ వర్క్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా కంపెనీల ఎగ్జిక్యూటిట్స్ టీఏ భారీగా తగ్గింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంపెనీకి ఈ ఏడాది రూ.742 కోట్లు ఖర్చయ్యిందని రిలయన్స్ ప్రకటించింది. గతేడాది అది రూ.600 కోట్లుగా మాత్రమే ఉంది.

పెరిగిన కమ్యూనికేషన్..

పెరిగిన కమ్యూనికేషన్..

కరోనా వైరస్ కన్నా ముందు కంపెనీలు ట్రావెలింగ్‌తో ఖర్చు ఉండేంది. కంపెనీ ఖర్చులో మూడో స్థానంలో ప్రయాణ విభాగం ఉండేది. టెక్నికల్ సిబ్బంది, కన్సల్టెంట్ల కోసం కంపెనీలు నగదు వెచ్చించేవి. పట్టికలో మూడు కంపెనీలో ట్రావెలింగ్, కమ్యూనికేషన్ బిల్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గగా.. కమ్యునికేషన్ బిల్లు మాత్రం పెరిగాయి.

కంపెనీల ఖర్చు లెక్కలివే..

కంపెనీల ఖర్చు లెక్కలివే..

ఇన్ఫోసిస్ కంపెనీ ప్రయాణ ఖర్చులు 86 శాతం తగ్గాయి. రూ.827 కోట్ల నుంచి ఈ ఏడాది జూన్‌లో కేవలం 116 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. కానీ కమ్యూనికేషన్ కోసం మాత్రం రూ.127 కోట్ల నుంచి రూ.163 కోట్లను వెచ్చించాల్సి వచ్చింది. అంటే 28 శాతం వ్యయం పెరిగింది. ఇక టీసీఎస్ కూడా 69 శాతం ట్రావెలింగ్ వ్యయం తగ్గింది. కమ్యునికేషన్ కోసం మాత్రం 22 శాతం పెరిగింది. విప్రో ట్రావెల్ కోసం 75 శాతం వ్యయం తగ్గగా.. కమ్యూనికేషన్ కోసం 26 శాతం పెరిగింది.

English summary

తగ్గిన ట్రావెల్ బిల్స్, పెరిగిన కమ్యూనికేషన్ వ్యయం, ఆ టాప్ 3 కంపెనీల ఖర్చుల వివరాలివే.. | Covid-19 effect on IT firms: Travel bills down, but communication costs increase..

Covid-19 pandemic halting travel and forcing people to work from homes, Indian IT majors TCS, Infosys and Wipro have travel expenditure has fallen by up to 86 per cent in the June quarter
Story first published: Friday, July 17, 2020, 10:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X