For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Work From Home: ఇంటి నుంచి పనిచేస్తున్నరా..? ఉద్యోగం పోవచ్చు జాగ్రత్త..!!

|

Work From Home: సాధారణంగా ఉద్యోగులు ఎంత తెలివైనవారో.. వారికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలు సైతం అంతే తెలివైనవి. ఇప్పడు సాంకేతికత పెరిగిపోయిన తర్వాత ఉద్యోగులు పనిచేస్తున్నంతసేపూ డేగ కళ్లతో పర్యవేక్షించబడుతూనే ఉన్నారు. ఒక మహిళా ఉద్యోగి విషయంలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ పెనాల్టీ..

భారీ పెనాల్టీ..

కెనడాకు చెందిన ఒక మహిళ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తోంది. అయితే పని చేయాల్సిన షిఫ్ట్ వేళల్లో సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తూ కంపెనీ యాజమాన్యానికి పట్టుబడింది. అయితే ఈ విషయం కాస్తా కోర్టు దాకా వెళ్లింది. దీంతో కోర్టు సైతం ఆమెకు మెట్టికాయలు వేస్తూ 2,600 కెనడియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపుగా రూ.3 లక్షల కంటే ఎక్కువ మెుత్తాన్ని చెల్లించాలంటూ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అసలు ఏం జరిగింది..

అసలు ఏం జరిగింది..

బ్రిటిష్ కొలంబియాలో రిమోట్‌గా అకౌంటెంట్‌గా పనిచేస్తోంది కార్లీ బెస్సే అనే మహిళ. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లో సదరు మహిళ దాదాపుగా 50 పనిగంటలను వృధా చేసిందని, ఆఫీసు పనులు కాక ఇతరపనులకు ఆ సమయాన్ని కేటాయించిందంటూ ఆమెను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తీసేశారంటూ ఆమె కోర్టులో పేర్కొంది.

కనిపెట్టింది ఇలా..

కనిపెట్టింది ఇలా..

కంపెనీ సదరు మహిళా ఉద్యోగి ల్యాప్‌టాప్‌లో TimeCamp అనే ఉద్యోగి-ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసింది. దీని ద్వారా ఆమె పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తుండగా.. కంపెనీ కేటాయించిన ఫైల్‌లు బడ్జెట్‌కు మించి ఉన్నాయని, షెడ్యూల్‌లో వెనుకబడి ఉన్నాయని యాజమాన్యం గుర్తించింది. దీంతో ఆమె ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో సమయం వృధా చేయటాన్ని కంపెనీ గుర్తించి ఉద్యోగం నుంచి తొలగించింది.

సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుంది..

సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుంది..

కంపెనీ ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏదైనా డాక్యుమెంట్ ను ఓపెన్ చేసినప్పుడు దానిపై కేటాయించిన సమయాన్ని ట్రాక్ చేసి పనిచేసిన సమయాన్ని రికార్డు చేస్తుంది. పైగా కంపెనీ సదరు మహిళా ఉద్యోగి టైమ్‌షీట్‌లు, సాఫ్ట్‌వేర్ వినియోగ లాగ్‌ల మధ్య అక్రమాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అలా రెండింటినీ కంపెర్ చేయగా దాదాపు 50 పని గంటలను బెస్సే దుర్వినియోగం చేసినట్లు కోర్టుకు వెల్లడించింది. కోర్టు దీనిని సమయం దొంగతనంగా పరిగణిస్తూ.. కంపెనీకి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఉద్యోగి వాదన..

ఉద్యోగి వాదన..

దీనిపై తన వాదనను వినిపించిన మహిళ సదరు సాఫ్ట్ వేర్ పని, పర్సనల్ సమయం మధ్య తేడాను గుర్తించటంలో విఫలమైందని పేర్కొంది. దీనికి తోడు కంపెనీ తనకు చెల్లించని వేతనం కింద రూ.3.03 లక్షల పరిహారాన్ని అందించాలని, ఉద్యోగాన్ని తొలగించకుండా చూడాలని కోరింది. మెుత్తానికి ఇప్పుడు ఇళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు దీని నుంచి చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఆఫీసు వేళల్లో ఇతర పనులు చేస్తే ఉద్యోగం కోల్పోవటం పక్కా అని తెలుస్తోంది. అసలే ఇప్పుడు టైం కూడా అస్సలు బాలేదు మరి.

English summary

Work From Home: ఇంటి నుంచి పనిచేస్తున్నరా..? ఉద్యోగం పోవచ్చు జాగ్రత్త..!! | Company Fired employees after tracking she wasted time during work from home

Company Fired employees after tracking she wasted time during work from home
Story first published: Thursday, January 19, 2023, 10:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X