For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ లోపు మధ్యంతర డివిడెండ్ ప్రకటించేందుకు కంపెనీలు సిద్ధం

|

వివిధ కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త బడ్జెట్ ప్రపోజల్‌కు ముందే మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. డివిడెండ్స్ పైన ఇప్పటి వరకు షేర్ హోల్డర్స్ ఎలాంటి ట్యాక్స్ లేదా ఇతర పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.10 లక్షలలోపు ఇది వర్తిస్తుంది. తాజా బడ్జెట్ ప్రకారం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT)ని ఇన్వెస్టర్లు తమ తమ ట్యాక్స్ పరిమితి మేరకు చెల్లించాలి.

డివిడెండ్‌పై కంపెనీలకు ఊరట.. వాటా దారులకు పన్ను భారండివిడెండ్‌పై కంపెనీలకు ఊరట.. వాటా దారులకు పన్ను భారం

ఇప్పుడు అధిక ప్రమోటర్ హోల్డింగ్స్ కంపెనీలు కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 లోపు భారీగా మధ్యంతర డివిడెండ్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ అనంతరం ట్యాక్స్ గ్రహీతలు కట్టవలసి ఉంటుంది. ముందే భారీ డివిడెండ్లు ప్రకటించి సొమ్ము చేసుకోవాలని ప్రమోటర్లు భావిస్తున్నారట.

Companies may announce high interim dividends before April

ఏప్రిల్ 1 తర్వాత వచ్చే డివిడెండ్లపై ప్రమోటర్లు దాదాపు 43 శాతం పన్ను చెల్లించాలి. ప్రస్తుతం కంపెనీల షేర్ హోల్డర్లు దేశీయ కంపెనీల నంచి పొందే డివిడెండ్ ఆదాయం రూ.10 లక్షల లోపు ఉంటే పన్ను అవసరం లేదు. ఈ మొత్తం దాటితే పన్ను 10 శాతం ఉంటుంది. DDT ఎత్తివేయడంతో షేర్ హోల్డర్లు వారి వారి ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం డివిడెండ్ ఆదాయంపై పన్ను చెల్లించాలి. ఈ నేపథ్యంలో కంపెనీలు మార్చిలో డివిడెండ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయట.

రిలయన్స్ నుంచి ముఖేష్ అంబానీ, వేదాంత నుంచి అనిల్ అగర్వాల్, హీరోమోటో కార్ప్ నుంచి ముంజాల్ కుటుంబం వందలు, వేల కోట్లను డివిడెండ్ రూపంలో పొందాయి. ఈ కంపెనీలు మార్చి చివరకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించకుంటే వీటి ప్రమోటర్లు తర్వాత పొందే డివిడెండ్లపై అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

English summary

ఏప్రిల్ లోపు మధ్యంతర డివిడెండ్ ప్రకటించేందుకు కంపెనీలు సిద్ధం | Companies may announce high interim dividends before April

Companies with high promoter holding may announce high interim dividends in March before the new budget proposal.
Story first published: Monday, February 3, 2020, 15:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X