దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్‌కు 2019లో డిమాండ్ పెరిగింది. కార్యాలయ స్థలాల లీజింగ్ కొత్త రికార్డుకు చేరుకుంది. దేశంలో గ్రాస్ ఆఫీస్ లీజింగ్ వ్యాల్యూమ్ 2019లో 69.4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇది 49.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా 9 అగ్రశ్రేణి నగరాల కమర్షియల్ స్పేస్ అబ్సార్ప్‌షన్ 60 మిలియన్ చదరపు అడుగులను తాకింది. పాన్ ఇండియా గ్రాస్ ఆఫీస్ లీజింగ్ వ్యాల్యూమ్ 69.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
CBRE సౌత్ ఏసియా ప్రకారం గ్రాస్ లీజింగ్ యాక్టివిటీ 2018తో పోలిస్తే 2019లో తొమ్మిది ప్రధాన నగరాల్లో 25 శాతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 61.6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. జాబితాలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ నిలిచింది. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాలు టాప్ 4లో ఉన్నాయి.

కార్యాలయ స్థలం సప్లైతో పాటు డిమాండ్ కూడా జోరుగా పెరుగుతోందని వెల్లడించింది. 2019లో ఎనిమిది నగరాల్లో అద్దెకు ఇచ్చిన ఆఫీస్ ప్రదేశంలో 27% పెరిగి 6.06 కోట్ల చదరపు అడుగులకు చేరినట్టు ఇటీవలే నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. గత ఏడాది 7 ప్రధాన నగరాల్లో నికరంగా అద్దెకు తీసుకున్న ఆఫీస్ ప్రదేశం 40% పెరిగి 4.65 కోట్ల చదరపు అడుగులకు చేరుకున్నట్లు జేఎల్ఎల్ ఇండియా తెలిపింది.
విదేశాల్లోని కార్పోరేట్ కంపెనీలు, దేశంలోని జాతీయ సంస్థలు బెంగళూరు, హైదరాబాద్ సిటీల్లో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు CBRE వెల్లడించింది. గత ఏడాది జరిగిన మొత్తం లీజుల్లో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైల వాటానే దాదాపు 75% ఉన్నట్లు తెలిపింది. బిజినెస్‌కు అనువైన పరిస్థితులు, సంస్కరణల అమలు వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications