For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి, ప్లాంట్ తిరిగి ప్రారంభం..

|

అమెరికాలోని చ‌మురు పైప్‌లైన్ పైన సైబ‌ర్ దాడి జ‌రిగింది. ఆ తర్వాత అక్కడ ఆగిపోయిన వర్క్, తిరిగి ప్రారంభమైంది. దాడి నేపథ్యంలో మూడు రోజుల క్రితం అమెరికాలోని కొలోనియల్ పైప్‌లైన్ కంపెనీ మొత్తం నెట్‌వర్క్‌ను మూసివేశారు. మాల్వేర్‌ను ప్ర‌యోగించ‌డం ద్వారా సంస్థ కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ‌ను చేతుల్లోకి తీసుకుంది. తాము కోరిన డ‌బ్బు ఇవ్వాలని, లేదంటే డేటాని ఇంట‌ర్నెట్లో విడుద‌ల చేస్తామ‌ని హ్యాక‌ర్లు హెచ్చరించారు.

ఈ సంస్థకు చెందిన 100GB డేటాను హ్యాక‌ర్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అమెరికా ప్ర‌భుత్వం ద‌ర్యాప్తును ప్రారంభించింది. అమెరికాలోని అతిపెద్ద చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి తర్వాత ప్ర‌భుత్వం అత్యయిక‌ పరిస్థితిని ప్రకటించింది. ఈ దాడి కార‌ణంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావించారు. కానీ అంతగా ప్రభావం పడలేదు.

 Colonial Restarts After Cyberattack But Fuel Curbs to Linger

ప్రతిరోజు ఇక్కడి నుండి 2.5 మిలియన్ బ్యారెల్స్ ఇంధనం పైప్‌లైన్ ద్వారా రవాణా చేస్తారు. ఈ పైప్‌లైన్ తూర్పు తీరశుద్ధి కర్మాగారాలను తూర్పు-దక్షిణ అమెరికాతో కలుపుతుంది. శుక్రవారం సైబర్ దాడి అనంతరం క్లోజ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు దానిని తిరిగి ప్రారంభించింది.

English summary

అమెరికా చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి, ప్లాంట్ తిరిగి ప్రారంభం.. | Colonial Restarts After Cyberattack But Fuel Curbs to Linger

The largest gasoline pipeline in the U.S. is returning to service following a cyberattack that took the fuel artery offline for five days, offering hope that fuel shortages in several states will soon come to an end.
Story first published: Thursday, May 13, 2021, 21:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X