For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

400 ఎగ్జిక్యూటివ్‌లు కూడా: కంపెనీ వదిలి వెళ్లాలన్న కాగ్నిజెంట్, గత రెండేళ్ల నుంచి..

|

కరోనా వైరస్ ప్రభావం పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమ ఖర్చులను తగ్గించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు వేతనాలు తగ్గిస్తోండగా.. మరికొన్ని ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తోంది. అయితే కాగ్నిజెంట్ మాత్రం పెద్ద తలకాయలపై ఫోకస్ చేసింది. దాదాపు 400 మంది ఎగ్జిక్యూటివ్‌లను కంపెనీ వదలి వెళ్లాలని కోరినట్టు తెలుస్తోంది. ఇందులో డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు.

ఇప్పుడే కాదు రెండేళ్ల క్రితం కూడా సీనియర్ ఉద్యోగులు 200 మందిని కంపెనీ తొలగించింది. ఏడాదిక్రితం 400 మంది సీనియర్ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే మరికొందరు సీనియర్ ఉద్యోగులు ఉన్నారని కాగ్నిజెంట్ సీఈవో బ్రియన్ హంప్రిస్ భావిస్తున్నారు.

Cognizant will ask 400 more executives to leave

లాక్ డౌన్ వల్ల ఖర్చులను తగ్గించుకొనే చర్యలో భాగంగా సీనియర్ ఉద్యోగుల తొలగింపు తప్పడం లేదు అని కంపెనీ పేర్కొన్నది. తమకు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారని.. వీరంతా క్లైయింట్ల సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు.

ఆర్థిక మాంద్యానికి తోడు లాక్ డౌన్ వల్ల ప్రాజెక్టులు రావడం లేదు అని.. ఉన్న ఉద్యోగులను తగ్గించాల్సి వస్తోందని తెలిపింది. 400 మంది సీనియర్ ఉద్యోగులను కంపెనీ నుంచి వెళ్లిపోవాలని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

English summary

400 ఎగ్జిక్యూటివ్‌లు కూడా: కంపెనీ వదిలి వెళ్లాలన్న కాగ్నిజెంట్, గత రెండేళ్ల నుంచి.. | Cognizant will ask 400 more executives to leave

400 executives holding the title of directors, senior directors, associate vice-presidents, vps, svps would be asked to leave the firm.
Story first published: Wednesday, May 27, 2020, 18:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X