For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాగ్నిజెంట్ ఉద్యోగులకు భారీ వేతన పెంపు, ప్రమోషన్లు

|

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలు నిరాశపరిచాయి. నికర లాభం 30 శాతం క్షీణించి 348 మిలియన్ డాలర్ల(రూ.2,578 కోట్లు)కు పరిమితమైంది. డిజిటల్ వ్యాపారంలో బలమైన గణాంకాలు నమోదు చేసినట్లు తెలిపింది. 2019 సెప్టెంబర్ క్వార్టర్‌లో 497 మిలియన్ డాలర్లుగా నమోదయింది. ఆదాయంలో మాత్రం పెద్దగా మార్పులేదు. 4.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది. కరోనా కష్టకాలంలోను మంచి పనితీరును కనబరిచామని, డిజిటల్ వ్యాపారంలో బుకింగ్స్ పెరిగాయని, సాధారణ వ్యాపారంలో బుకింగ్స్ ఏడాది నుండి ఇప్పటి వరకు 15 శాతం పెరిగిదే, డిజిటల్ బుకింగ్స్ 40 శాతం పెరిగాయని కాగ్నిజెంట్ సీఈవో బ్రెయిన్ హాంప్రీస్ అన్నారు.

రిస్క్‌లో రూ.1 లక్ష కోట్ల రుణాలు, క్రెడిట్ కార్డ్ జారీలో అప్రమత్తంరిస్క్‌లో రూ.1 లక్ష కోట్ల రుణాలు, క్రెడిట్ కార్డ్ జారీలో అప్రమత్తం

2020 సెప్టెంబర్ నాటికి కాగ్నిజెంట్ కంపెనీలో 2,83,100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నాస్‌డాక్ లిస్టెడ్ కంపెనీ తమ ఉద్యోగులకు వేతనాల పెంపు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. నాలుగో క్వార్టర్‌లో వీటిని అమలు చేయనుంది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి టెక్ దిగ్గజాలు వేతనాల పెంపు, ప్రమోషన్లు ప్రకటించాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ అదేదారిలో నడుస్తోంది.

Cognizant announces hikes, reports highest attrition among peers

సెప్టెంబర్ త్రైమాసికంలో ఆట్రిషన్ 18 శాతంగా నమోదయింది. ఇతర ఐటీ కంపెనీలతో పోలిస్తే ఆట్రిషన్ ఎక్కువగా ఉంది. ఈ త్రైమాసికంలో దాదాపు 2,000 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగాలు 2.83 లక్షలకు చేరుకున్నాయి. కాగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతనాల పెంపు అమలు చేయనున్నట్లు ప్రకటించాయి.

English summary

కాగ్నిజెంట్ ఉద్యోగులకు భారీ వేతన పెంపు, ప్రమోషన్లు | Cognizant announces hikes, reports highest attrition among peers

Cognizant has said it will implement merit-based hikes and promotions in the fourth quarter, joining its peers such as TCS, Infosys and Wipro, as IT services firms see a pickup in demand with more clients adopting digital and migrating to cloud.
Story first published: Friday, October 30, 2020, 22:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X