For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG Cylinder price: అక్టోబర్‌లో ఎల్పీజీ, పైప్‌లైన్ వంటగ్యాస్‌పై మరో భారీ బాదుడు

|

న్యూఢిల్లీ: కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోన్న చమురు సంస్థలు.. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వంటగ్యాస్ సిలిండర్ల మీద పడ్డాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నాయి. ఈ నెల 1వ తేదీన వంటగ్యాస్ సిలిండర్ ఒక్కింటికి 25 రూపాయలను పెంచేశాయి. దీనితో కొన్ని చోట్ల గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధర 900 రూపాయలను దాటేసింది. చాలా చోట్ల ఈ మార్క్‌కు చేరువైంది.

 పెంపుదల ఇలా..

పెంపుదల ఇలా..

జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 190 రూపాయల మేర పెరిగింది ఎల్పీజీ సిలిండర్ల ధర. తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన 25 రూపాయల మేర పెరిగంది. అదే నెల 15వ తేదీన ఏకంగా 50 రూపాయల మేర వాటి రేటును పెంచాయి చమురు సంస్థలు. 25వ తేదీన మరో 25 రూపాయల మేర అదనపు భారాన్ని మోపాయి. మార్చి 1వ తేదీన 25 రూపాయలు, ఏప్రిల్ 1వ తేదీన 10 రూపాయలు, జులై 1వ తేదీన 25 రూపాయల మేర పెంచాయి. ఆగస్టు 18వ తేదీన 25 రూపాయలు పెంచాయి. తాజాగా మళ్లీ 25 రూపాయల భారం మోపాయి.

అక్టోబర్‌లో మరో బాదుడు..

అక్టోబర్‌లో మరో బాదుడు..

ఈ పరిస్థితుల మధ్య అక్టోబర్‌లో మరోసారి చమురు సంస్థలు వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పెంపుదల 10 నుంచి 11 శాతం వరకు ఉండొచ్చని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది. అక్టోబర్‌లో 76 శాతం మేర ఎల్పీజీ ధరలను పెంచుకునేలా కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు అనుమతి ఇచ్చిందని తెలిపింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఆరు నెలల తరువాత ఒకసారి ఎల్పీజీ ధరలను సవరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు ఇచ్చింది.

అక్టోబర్ 1న సవరణ..

అక్టోబర్ 1న సవరణ..

ఏప్రిల్ 1వ తేదీన ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఆరు నెలల కాలం పూర్తవుతుంది. అక్టోబర్ నుంచి తరువాతి నెల ఆరంభమౌతుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీకి గ్యాస్‌ను వెలికితీయడానికి అయ్యే వ్యయం.. ఒక మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్,2కు 3.15 డాలర్లు అవుతుంది. 1.79 డాలర్ల బ్రోకరేజీ అదనం. దీనితో కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ-6 చమురు క్షేత్రం నుంచి గ్యాస్‌ను వెలికి తీయడానికి ఓఎన్జీసీపై అదనపు భారం పడుతుంది.

సీఎన్జీ కూడా..

సీఎన్జీ కూడా..

దాన్ని ఆయిల్ కంపెనీలకు బదిలీ చేస్తుంది ఓఎన్జీసీ. ఆ అదనపు భారాన్ని చమురు కంపెనీలు వినియోగదారులపై మోపుతాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. ఎల్పీజీ మాత్రమే కాకుండా.. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలను కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోందని తెలిపింది. అడ్మినిస్టర్డ్ రేట్ ప్రకారం.. 10 నుంచి 11 శాతం మేర ఎల్పీజీ, సీఎన్జీ రేట్లు పెరుగుతాయని, ఈ మేరకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్లేయర్లు సమాయాత్తమౌతోన్నాయని అంచనా వేసింది. ధరల పెంపుదలను సీఎన్జీతో పాటు ఎల్పీజీ సిలిండర్‌పై కాకుండా పైప్ ద్వారా సరఫరా అయ్యే వంటగ్యాస్‌పై మోపే అవకాశం అధికంగా ఉందని తెలిపింది.

15 రోజుల్లోనే 50 రూపాయలు..

15 రోజుల్లోనే 50 రూపాయలు..

రెండువారాల వ్యవధిలో ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచేయడం ఇది రెండోసారి. ఇదివరకు- ఈ నెల 18వ తేదీన తొలిసారిగా వంటగ్యాస్ సిలిండర్ల ధరను 25 రూపాయల మేర పెంచిన విషయం తెలిసిందే. అంతలోనే మరోసారి పెంపుదలకు పూనుకున్నాయి. మళ్లీ 25 రూపాయలను పెంచాయి. ఫలితంగా- ఈ 15 రోజుల వ్యవధిలోనే 50 రూపాయలను అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారులపై పడింది.

నాన్ సబ్సిడీ ఎల్పీజీపై 75 రూపాయలు..

నాన్ సబ్సిడీ ఎల్పీజీపై 75 రూపాయలు..

గృహావసర వినియోగదారులపైనే కాదు.. కమర్షియల్ కన్జ్యూమర్స్‌పైనా భారం మోపాయి చమురు కంపెనీలు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను 75 రూపాయల చొప్పున పెంచాయి. తాజా పెంపుదలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధర 900 రూపాయలను దాటేసింది. గృహ, వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీ సిలిండర్లను వినియోగించే వారిపై రెండు వారాల వ్యవధిలో 50 రూపాయల మేర అదనపు భారం పడినట్టయింది.

అక్కడ రూ.900

అక్కడ రూ.900

తాజా పెంపుతో 14.2 కిలోల బరువు ఉండే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర దేశ రాజధానిలో 884.50 పైసలకు చేరింది. కమర్షియల్ సిలిండర్ రేటు 1,693 రూపాయలకు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా అంటే తాజా పెంపు వరకు చమురు సంస్థలు వంటగ్యాస్ సిలిండర్లపై మోపిన అదనపు భారం 190 రూపాయలు. కిందటి నెల 18వ తేదీన 25 రూపాయల మేర ఎల్పీజీ సిలిండర్‌ రేటును పెంచిన ఆయిల్ కంపెనీలు.. 15 రోజుల్లోనే మరోసారి వాత వేయడం ఏ మాత్రం ఊహించని పరిణామం.

ఢిల్లీలో రూ. 884

ఢిల్లీలో రూ. 884

తాజా పెంపుతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గృహావసర ఎల్పీజీ సిలిండర్ ధర రూ.884.50 పైసలకు చేరింది. మంగళవారం నాటి ధర 859.50 పైసలుగా నమోదైంది. చెన్నైలో వంటగ్యాస్ ధర అత్యధికంగా నమోదైంది. 900 రూపాయలను దాటేసింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 900.50 పైసలకు చేరింది. లక్నోలో రూ. 897.50 పైసలుగా నమోదైంది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు తగ్గించాయని ఆనందించే లోపే దానికి ఎన్నో రెట్ల అదనపు భారాన్ని డొమెస్టిక్, నాన్ సబ్సిడీ సిలిండర్లపై మోపినట్టయింది.

English summary

LPG Cylinder price: అక్టోబర్‌లో ఎల్పీజీ, పైప్‌లైన్ వంటగ్యాస్‌పై మరో భారీ బాదుడు | CNG, and piped cooking gas prices may jump upto 10% in Oct: ICICI Securities reports

The ICICI Securities said in its report that the CNG and piped cooking gas prices in cities such as Delhi and Mumbai may be hiked by 10-11 per cent next month.
Story first published: Saturday, September 11, 2021, 14:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X