For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు బ్యాంకు కస్టమర్ల భయాందోళన షాక్, లార్జ్ మనీ తీసుకోవాలంటే.. కొత్త నిబంధనలు

|

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. బ్యాడ్ లోన్స్ పెరిగాయి. మరోవైపు నగదుకోసం ప్రజలు బ్యాంకులకు పరుగెత్తుతున్నారు. ఆర్థిక స్థితిగతులపై ఆందోళనల నేపథ్యంలో లార్జ్ ట్రాన్సాక్షన్స్‌పై దృష్టి సారించింది చైనా. ఇందులో భాగంగా దీని కోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా హెబీ ప్రావిన్స్‌లో పైలట్ కార్యక్రమంగా చేపట్టింది. దీని ప్రకారం రిటైల్, బిజినెస్ క్లయింట్స్ ఎవరైనా పెద్దమొత్తంలో ఉపసంహరించుకోవాలన్నా లేదా డిపాజిట్ చేయాలన్నా ముందుగా తెలియజేయాల్సి ఉంది.

అమెరికా నుండి భారత్ వరకు అంతే: పెను సంక్షోభం.. ఆర్బీఐ వద్దకు మళ్లీ మోడీ ప్రభుత్వంఅమెరికా నుండి భారత్ వరకు అంతే: పెను సంక్షోభం.. ఆర్బీఐ వద్దకు మళ్లీ మోడీ ప్రభుత్వం

ఈ మొత్తం దాటితే..

ఈ మొత్తం దాటితే..

ఇది రెండేళ్ల ప్రోగ్రాం కాగా, ఈ అక్టోబర్ నాటికి జెజియాంగ్, షెంజెన్‌లకు విస్తరిస్తారు. అప్పటికి 70 మిలియన్ల ప్రజలు దీని పరిధిలోకి వస్తారు. 71,000 డాలర్లకు (5,00,000 యువాన్లు) మించి జరిపే ట్రాన్సాక్షన్స్ పైన సమాచారాన్ని అందించాల్సి ఉంది. అంతకుమించిన ట్రాన్సాక్షన్స్‌ను తిరస్కరించాలని బ్యాంకులకు సూచించనప్పటికీ.. ఈ వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉంది.

ఎందుకు ఈ నిబంధన

ఎందుకు ఈ నిబంధన

దాదాపు నాలుగు దశాబ్దాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ తొలిసారి భారీగా నెమ్మదించింది. దీంతో బ్యాంకులు బ్యాడ్ లోన్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రజలు భయాందోళనతో ఉపసంహరణ చేస్తున్నారు. ఇది మరో సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు అంశంపై పైలట్ ప్రోగ్రాంను చేపట్టారు. ప్రస్తుత ప్రాజెక్టులో వ్యాపారులకు 500,000 యువాన్లుగా ఉంది. ప్రాంతాన్ని బట్టి వ్యక్తులకు ఇది 100,000 యువాన్ల నుండి 300,000 యువాన్ల వరకు ఉండవచ్చునని చెబుతున్నారు. కరోనా సహా వివిధ కారణాలతో అనేకమంది స్థానిక బ్యాంకుల నుండి తమ డిపాజిట్లు తీసుకోవడానికి గుమికూడారు. దీంతో కొన్ని బ్యాంకులు కస్టమర్లకు చెల్లింపులు జరపలేకపోయారట. అయితే ప్రజలు ఎలాంటి రూమర్స్ నమ్మవద్దని బ్యాంకులు కోరుతున్నాయి. మొత్తానికి బ్యాంకుల్లో బ్యాడ్ లోన్స్ పెరుగుతున్నాయనే ఆందోళనలు, ప్రజలు పెద్ద ఎత్తున విత్ డ్రా కోసం మొగ్గు చూపడంతో పెద్ద ఎత్తున క్యాష్ ఉపసంహరణపై ఆంక్షలు విధించింది.

బ్యాడ్ లోన్లు

బ్యాడ్ లోన్లు

ఎస్ అండ్ పీ గ్లోబల్ ప్రకారం ఈ ఏడాది బ్యాడ్ లోన్లు 8 ట్రిలియన్ యువాన్లకు పెరగవచ్చును. చిన్న బ్యాంక్స్ బ్యాడ్ లోన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూబీఎస్ గ్రూప్ ఏజీ ప్రకారం చిన్న బ్యాంకులకు కొత్తగా 349 బిలియన్ డాలర్ల క్యాపిటల్ అవసరం. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తక్కువ లాభంతో రుణాలు ఇవ్వాలని రెగ్యులేటర్స్ సూచిస్తున్నారు. ఇది ఈ వ్యవస్థపై మరింత భారంగా మారుతోంది.

English summary

చైనాకు బ్యాంకు కస్టమర్ల భయాందోళన షాక్, లార్జ్ మనీ తీసుకోవాలంటే.. కొత్త నిబంధనలు | China to keep large transactions in check

China has imposed a program to keep large transactions in check amid concerns over the state of its financial in the wake of the COVID-19 outbreak.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X