For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలు! సీఈఏ సుబ్రమణియన్ ఏమన్నారంటే

|

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతోంది. పలుప్రాంతాల్లో రూ.100 క్రాస్ చేసిన లీటర్ పెట్రోల్ ధరలు, మెట్రో నగరాల్లో రూ.90కి పైనే ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఉత్పత్తుల ధరల పెంపు కారణంగా ఈ ప్రభావం మనపై పడుతోంది.

అయితే పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తున్నప్పటికీ పలు రాష్ట్రాలు సుముఖంగా లేవు. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణియన్ అన్నారు.

SBI gold loan: మిస్డ్ కాల్ ఇస్తే చాలు... అర్హత, వడ్డీ రేటు ఎంత తక్కువ అంటే?SBI gold loan: మిస్డ్ కాల్ ఇస్తే చాలు... అర్హత, వడ్డీ రేటు ఎంత తక్కువ అంటే?

మంచిదే, నిర్ణయం వారిదే

మంచిదే, నిర్ణయం వారిదే

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశముందనే వాదనల నేపథ్యంలో కేవీ సుబ్రమణియన్ ఈ అంశంపై స్పందించారు. పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే ప్రతిపాదనకు తాను మద్ధతిస్తున్నానని చెప్పారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదేనని అయితే, దీనిపై నిర్ణయాధికారం మాత్రం జీఎస్టీ కౌన్సిల్‌దేనని ఫిక్కీ ఎఫ్ఎల్‌ఓ(మహిళా విభాగం) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికంగానే ఉన్నాయన్నారు.

కేంద్రమంత్రులు కూడా

కేంద్రమంత్రులు కూడా

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇటీవల కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్ అన్నారు. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర ధరలు పెరుగుతాయి. ఇది ప్రజలకు భారం, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ భారం

పెట్రోల్, డీజిల్, గ్యాస్ భారం

పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు గ్యాస్ ధరలు కూడా పెరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే పెట్రోల్ ధరలు పెరిగాయి. గ్యాస్ ధరలు గత రెండు నెలల కాలంలో రూ.200కు పైగా పెరిగింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఫిబ్రవరి నెలలోనే మూడుసార్లు ఎగిసింది. ఒక్క నెలలోనే రూ.100 పెరిగింది. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో పాల ధరలు కూడా పలు ప్రాంతాల్లో పెరగనున్నాయి.

English summary

GST పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలు! సీఈఏ సుబ్రమణియన్ ఏమన్నారంటే | Chief Economic Advisor backs proposal To Bring Petrol Under GST

Chief Economic Advisor K.V. Subramanian has backed a proposal to bring petroleum products under the ambit of the Goods and Services Tax (GST).
Story first published: Monday, March 1, 2021, 7:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X