For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ సహా ఎవరు వచ్చినా: ఇన్ఫోసిస్‌కు ఆ మూడు కొత్త ఉత్సాహం

|

గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా మహమ్మారి కారణంగా వ్యాపార అనిశ్చితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వేతనాల పెంపు, ప్రమోషన్లు ఇస్తోందని ఇన్పీ సీఈవో సలీల్ పరేఖ్ ఈటీ-నౌ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, భారత్ సహా వివిధ ప్రాంతాల్లో భారీగా నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

సాఫ్టువేర్ దిగ్గజం ఏప్రిల్ నెలలో కరోనా కారణంగా శాలరీ హైక్, ప్రమోషన్లు హోల్డ్‌లో ఉంచింది. అయితే ఆ తర్వాత కొంతమంది ఉద్యోగులకు హైక్స్ విషయంలో ఊరట కల్పించింది. అప్పుడు శాలరీ హైక్స్, ప్రమోషన్లు నిలిపివేసినప్పటికీ ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను గౌరవిస్తామని తెలిపింది. ఈ మేరకు జూన్-సెప్టెంబర్ క్వార్టర్‌లో ఫ్రెషర్స్‌ను తీసుకోవడం ప్రారంభించింది.

కేంద్రమంత్రి చెప్పింది నిజమే: టయోటా నో.. తర్వాత రూ.2000 కోట్ల పెట్టుబడి, ఎందుకు, ఏం జరిగింది?కేంద్రమంత్రి చెప్పింది నిజమే: టయోటా నో.. తర్వాత రూ.2000 కోట్ల పెట్టుబడి, ఎందుకు, ఏం జరిగింది?

ట్రంప్ సహా ఎవరు వచ్చినా.. ఇబ్బందిలేకుండా

ట్రంప్ సహా ఎవరు వచ్చినా.. ఇబ్బందిలేకుండా

కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని వంటి కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు శాలరీ హైక్స్, ప్రమోషన్లు ఇచ్చాయి. ఇన్ఫోసిస్ కూడా అదే దిశగా అడుగులు వేసింది. అమెరికాలో 13000 మంది ఉద్యోగులు ఉన్నారని, స్థానిక ఉద్యోగులను మరో 12,000 మందిని కొత్తగా చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రాజెక్టులు పెరుగుతున్నందున ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు 2022 నాటికి పూర్తవుతాయన్నారు. అంటే నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల అనంతరం అమెరికాలో ట్రంప్ లేదా ఇతరులు.. ఎవరు అధికారంలోకి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వీసా సంబంధిత అడ్డంకులు అధిగమించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ మోడల్ కొనసాగుతుంది...

ఈ మోడల్ కొనసాగుతుంది...

అమెరికాతో పాటు ఇతర ప్రాంతాల్లోను నియామకాలు ఉంటాయని సలీల్ పరేఖ్ చెప్పారు. భారత్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోను పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నామన్నారు. ఇన్ఫోసిస్ ఓ వ్యాపార, ఆర్థిక నమూనాను నిర్మించిందని చెప్పారు. తమ సంస్థ భారత్ సహా అంతటా కాలేజ్ లెవల్ నియామకాల నుండి సీనియర్ లెవల్ వరకు ఉంటాయని చెప్పారు. సమర్థవంతంగా పని చేసేందుకు ఈ మోడల్ కొనసాగిస్తామన్నారు. ఇన్ఫోసిస్ ఇటీవల పలు ప్రాజెక్టులు దక్కించుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన గైడ్ విజన్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. రీస్కిల్-రీస్టార్ట్ పేరుతో 500 మంది ఉద్యోగులను తీసుకోనుంది. అంతకుముందు అమెరికన్ మెడికల్ డివైజ్‌ను కంపెనీ ఇన్ఫోసిస్ దక్కించుకుంది. మొత్తానికి వేతనాల పెంపు, నియామకాలు, వీసా ప్రత్యామ్నాయాలతో ఇన్ఫోసిస్ సాగుతోంది.

లక్ష నియామకాలు

లక్ష నియామకాలు

భారత అగ్ర ఐటీ సంస్థలు ఈ ఏడాది లక్ష మందికి పైగా నియామకాలు చేపడతామని ప్రకటించాయి. ఇందులో ఇండియన్ ఐటి దిగ్గజం టీసీఎస్ 40,000 నియామకాలు ఉంటాయని తెలిపింది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ఐటీ సంస్థలు సహా అన్ని రంగాల్లోని కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. కాగ్నిజెంట్, ఐబీఎం, యాక్సెంచర్ వంటి సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. రాబోయే నెలల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కానీ మన ఐటీ సంస్థలు వ్యాపార విస్తరణ నేపథ్యంలో నియామకాలు చేపట్టనున్నాయని తెలుస్తోంది.

English summary

ట్రంప్ సహా ఎవరు వచ్చినా: ఇన్ఫోసిస్‌కు ఆ మూడు కొత్త ఉత్సాహం | Cheers for Infosys amid Covid gloom

Despite an uncertain business environment, Infosys has begun to get things moving on salary hikes and promotions, CEO Salil Parekh told in an interview.
Story first published: Wednesday, September 16, 2020, 18:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X