For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎం కిసాన్ eKYC గడువు రెండు నెలలు పొడిగింపు

|

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకానికి కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి ఆధార్ నమోదును తప్పనిసరి చేసింది. eKYCని పూర్తి చేయడానికి మొదట మార్చి 31, 2021 నాటికి గడుును ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఈ గడువును మే 31వ తేదీ వరకు పొడిగించింది. అయినప్పటికీ రైతులు తమ ఆధార్ వివరాలను నమోదు చేయలేదు. దీంతో eKYC పూర్తి చేయడానికి జూలై 31వ తేదీ వరకు గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు పీఎం కిసాన్ వెబ్ సైట్‌లో పేర్కొంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు వారి బ్యాంకు ఖాతాలో ఒక్కో విడతలో రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. eKYC పూర్తి చేయకుంటే 11వ ఇన్‌స్టాల్‌మెంట్ పీఎం కిసాన్‌లో ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఇప్పుడు దీనిని నెల రోజులు పొడిగించడంతో రైతులకు భారీ ఊరట కలిగించే అంశం. eKYC పూర్తి చేయడానికి ఇలా చేయండి.

Centre extends PM Kisan eKYC deadline till July

తొలుత పీఎం కిసాన్ వెబ్ సైట్‌ను సందర్శించాలి. eKYC ట్యాబ్ పైన క్లిక్ చేసి, ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి. సెర్చ్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన ఎంటర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, పక్కన ఉన్న గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు 4 అంకెల ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, సబ్‌మిట్ పైన క్లిక్ చేయాలి.
మళ్లీ ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మరో ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్ చేసి, సబ్‌మిట్ పైన క్లిక్ చేస్తే eKYC పూర్తవుతుంది.

English summary

పీఎం కిసాన్ eKYC గడువు రెండు నెలలు పొడిగింపు | Centre extends PM Kisan eKYC deadline till July

The Department of Agriculture & Farmers' Welfare, Government Of India has extended the deadline for making PM Kisan account KYC compliance.
Story first published: Saturday, June 4, 2022, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X