For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 లక్షలమందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం పండుగ కానుక

|

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ దసరా, దీపావళి పండుగ సందర్భంగా కానుక ఇచ్చింది. 2019-20 సంవత్సరానికి కేంద్రం బోనస్‌ను ప్రకటించింది. 30.67 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడివడిన, ఉత్పాదకేతర బోనస్‌ను దసరాకు ముందే ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. దీని వల్ల ఖజానాపై రూ.3,737 కోట్ల భారం పడుతుంది.

పండుగకు ముందు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, వెండిదీ అదే దారిపండుగకు ముందు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, వెండిదీ అదే దారి

రైల్వేలు, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, రక్షణ రంగాల్లో పని చేస్తున్న దాదాపు పదిహేడు లక్షల నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడివడన బోనస్, 13.70 లక్షల మంది ఎన్జీవోలకు ఉత్పాదకతతో సంబంధం లేని తాత్కాలిక బోనస్ ఇస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

 Centre announces Rs 3,737 crore bonus for over 30 lakh employees by next week

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019-2020కి సంబంధించి బోనస్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని జవదేకర్ తెలిపారు. ఈ వారం రోజుల్లో ఉద్యోగలకు బోనస్ ఇస్తామన్నారు. ఈ బోనస్‌ మధ్య తరగతివారికి పండగ సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే ఈ డబ్బును ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ దోహదపడుతుందన్నారు. ఈ బోనస్‌ను ఒకే ఇన్స్‌టాల్‌మెంట్‌లో విజయదశమిలోగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా లబ్ధిదారులకు బదిలీ చేయడం జరుగుతుందన్నారు.

English summary

30 లక్షలమందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం పండుగ కానుక | Centre announces Rs 3,737 crore bonus for over 30 lakh employees by next week

In a bid to encourage spending during the festive season, the Centre on Wednesday decided to give Rs 3,737 crore as bonus to 30.67 lakh non-gazetted central government employees. The decision to give productivity-linked bonus and non-productivity-linked bonus for 2019-2020 was taken at the meeting of the Union Cabinet.
Story first published: Thursday, October 22, 2020, 8:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X