For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold & Silver News: బంగారం, సిగరెట్లు, కరెన్సీలపై కేంద్రం షాకింగ్ నిర్ణయం.. ఇకపై అలా చేయటం అస్సలు కుదరదు..

|

Gold & Silver News: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, సిగరెట్లు, ఆభరణాలు, విలువైన లోహాలు, కరెన్సీ, పురాతన వస్తువులు, ఇతర వస్తువులను తాజాగా నియంత్రిత డెలివరీ జాబితాలో చేర్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే.. ఇకపై సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఈ జాబితాలోని విలువైన వస్తువులను దేశంలోకి దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదు.

అలాగే దేశం నుంచి విదేశాలకు ఈ వస్తువులను ఎగుమతి చేయడం కూడా కుదరదు. దీనికి అదనంగా.. అనుమానిత సరుకుల విషయంలో ట్రాకింగ్ పరికరాన్ని ఉంచే అధికారం సంబంధిత అధికారికి ఉంది.

నియంత్రిత జాబితాలోని వస్తువులు..

నియంత్రిత జాబితాలోని వస్తువులు..

నియంత్రిత డెలివరీ జాబితాలో నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు, వివిధ రసాయనాలు, నియంత్రిత పదార్థాలు లేదా వాటి ప్రత్యామ్నాయాలు, ఆల్కహాల్, ఇతర మత్తు పానీయాలు, నకిలీ కరెన్సీ, సిగరెట్లు, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, వన్యప్రాణుల ఉత్పత్తులు ఉంటాయని కేంద్రం సర్కులర్ లో వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. ఈ జాబితాలోని వస్తువుల ఎగుమతి లేదా దిగుమతి చేసుకోవటానికి సదరు సంస్థలు లేదా వ్యక్తులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ముందుగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.

అనుమానిత వస్తువుల విషయంలో..

అనుమానిత వస్తువుల విషయంలో..

ఒక అనుమానిత సరుకు దేశంలోకి దిగుమతి చేయబడుతోందని లేదా దేశం నుంచి ఎగుమతి చేయబడుతున్నట్లు అధికారి విశ్వసిస్తే.., అతను అటువంటి సరుకును నియంత్రిత డెలివరీని చేపట్టాలని ఆదేశించవచ్చు. దీని కోసం సంబంధిత అధికారి ఫారం-1లో నివేదిక సమర్పించాలి.

నియంత్రిత డెలివరీ చేపట్టడం కోసం దాఖలు చేసిన నివేదికను అనుమతులు కోరుతూ ఉన్నత స్థాయి సంబంధిత అధికారులకు ఇది పంపబడుతుంది. తనిఖీ తర్వాత అనుమానిత సరుకుల నియంత్రిత డెలివరీని అధికారులు ఆమోదించవచ్చు. ఆమోదించబడిన తర్వాత.. అనుమానిత సరుకులకు ట్రాకింగ్ పరికరాలను అధికారులు అమర్చుతారు.

అనుమతులు తీసుకోకపోతే..

అనుమతులు తీసుకోకపోతే..

నియంత్రిత డెలివరీ కోసం ముందస్తు అనుమతి పొందలేని పక్షంలో.. సంబంధిత అధికారి నుంచి వెంటనే ఆమోదం పొందవచ్చు. కానీ షెడ్యూల్డ్ కంట్రోల్డ్ డెలివరీ పూర్తయిన తర్వాత 72 గంటల్లోపు అనుమతి తీసుకోవాలి.

English summary

Gold & Silver News: బంగారం, సిగరెట్లు, కరెన్సీలపై కేంద్రం షాకింగ్ నిర్ణయం.. ఇకపై అలా చేయటం అస్సలు కుదరదు.. | Central government key decision on gold, silver, cigarettes and currency know full details

Central government key decision on gold, silver, cigarettes and currency put them under controlled delivery list
Story first published: Wednesday, July 13, 2022, 16:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X