For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Andhra Pradesh: కేంద్రం దృష్టిని ఆకర్షించిన జగనన్న స్కీమ్.. OPS కంటే ఎక్కువ ప్రయోజనం..

|

Andhra Pradesh: ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయి. స్వపక్షం, విపక్షం అని తేడా లేకుండా అందరికీ పథకాలను సీఎం జగన్ చేరువచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అమలు చేస్తున్న చాలా స్కీమ్ దేశంలోని చాలా రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ కేంద్రం దృష్టిని ఆకర్షిస్తోంది. పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్), కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) రెండింటిలోనూ అత్యుత్తమమైనవని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)పై ఇప్పుడు కేంద్రం దృష్టి పడింది. ఈ స్కీమ్ "ఆసక్తికరమైనది" అని అధికారులు విశ్వసిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిని వివరంగా అధ్యయనం చేయాల్సి ఉంది.

ఈ పథకం మొదటిసారిగా ఏప్రిల్ 2022లో ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి తగ్గింపు లేకుండా చివరిగా డ్రా చేసిన బేసిక్ పేలో 33 శాతం గ్యారెంటీ పెన్షన్‌ను అందిస్తుంది. దీని కోసం వారు ప్రతి నెలా వారి బేసిక్ జీతంలో 10 శాతం విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.

Central government interested over jagan governments guaranteed pension scheme model of andhra pradesh

ఒకవేళ ఉద్యోగి అత్యధికంగా నెలకు 14 శాతాన్ని పెన్షన్ విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే.. వారు చివరగా తీసుకున్న జీతంలో 40 శాతాన్ని హామీ పెన్షన్ రూపంలో పొందేందుకు Guaranteed Pension Scheme వెసులుబాటు కల్పిస్తోంది. మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఈ పెన్షన్ ను ప్రభావితం చేయదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ప్రస్తుత వడ్డీ రేట్లకు అనుగుణంగా.. ఇది సీపీఎస్ కింద అందుతున్న పెన్షన్ కంటే దాదాపు 70 శాతం ఎక్కువని ఆయన తెలిపారు.

ఏపీ కొత్తగా తీసుకొస్తున్న పెన్షన్ విధానం గురించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు వెల్లడించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ మోడల్ ఆసక్తికంగా ఉందని కాకపోతే దీని గురించి వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

English summary

Andhra Pradesh: కేంద్రం దృష్టిని ఆకర్షించిన జగనన్న స్కీమ్.. OPS కంటే ఎక్కువ ప్రయోజనం.. | Central government interested over jagan governments guaranteed pension scheme model of andhra pradesh

Central government interested over jagan governments guaranteed pension scheme model of andhra pradesh
Story first published: Wednesday, February 8, 2023, 16:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X