For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ టాప్ సెల్లర్స్‌పై CCI దాడులు, స్వాగతించిన CAIT

|

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన టాప్ సెల్లర్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించింది. పోటీ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై అమెజాన్ విక్రయదారులు క్లౌడ్ టెయిల్ ఇండియా, అప్పారియో రిటైల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అమెజాన్ సేల్స్‌లో దాదాపు 80 శాతం సేల్స్ క్లౌడ్ టెయిల్ ఇండియాకు చెందినవిగా ఉంటాయి. సోషల్ కామర్స్ మేజర్ మీషో విక్రయదారుల కార్యాలయాలలో కూడా సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

ఈ కార్యాలయాలపై దాడులు చేయడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా (CAIT) స్వాగతించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు వ్యతిరేకంగా CAIT చేసిన వివిధ ఫిర్యాదులు సమర్థించేలా సీసీఐ చర్యలు ఉన్నాయని, ఈ దాడులను స్వాగతిస్తున్నామని CAIT జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఈ-కామర్స్ దిగ్గజాలలో అక్రమాల గురించి మూడేళ్లుగా CAIT అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సీసీఐకి కూడా ఫిర్యాదు చేసింది.

CCI raids Amazon, Flipkart seller offices: CAIT welcomes the move

అమెజాన్ ఈ-కామర్స్ పోర్టల్ పారదర్శకతను పాటించడం లేదని, ఈ పద్ధతి దేశంలోని చిన్న రిటైలర్లకు భారీ నష్టాన్ని కలిగిస్తోందని, ఫలితంగా వినియోగదారులు కూడా నష్టపోతున్నారని CAIT చెబుతోంది. ధరల దోపిడీ, భారీ డిస్కౌంట్, కార్పోరేట్ కంపెనీలతో ఒప్పందం బ్రాండెడ్ ఉత్పత్తుల ఎక్స్‌క్లూజివ్ సేల్ వంటి అంశాలపై కూడా ఫిర్యాదు చేసింది. ఇవి FDI పాలసీకి విరుద్ధమని తెలిపింది.

అమెజాన్‌లో ఎక్కువగా క్లౌడ్ టెయిల్ ఇండియా, అప్పారియో బ్రాండ్స్, ఫ్లిప్‌కార్ట్‌లో డబ్ల్యుఎస్ రిటైల్, ఓమ్నిటెక్, సుపర్ కామెంట్ వంటి బ్రాండ్స్ ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు. అమెరికా నుండి విభిన్న రకాల వస్తువులు తీసుకు వచ్చి, టాప్ 100 సెల్లర్స్‌గా ఉన్న సంస్థల అమ్మకాలు కూడా భారీగా తగ్గాయట. వీరి పరిస్థితి ఇలా ఉంటే చిన్న సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అప్పారియో, క్లౌడ్ టెయిల్‌తో పాటు గత అయిదేళ్లుగా ఉన్న టాప్ 20 విక్రేతల జాబితాను కూడా పరిశీలించాలని, ఎందుకంటే అమెజాన్ ప్రభుత్వ అన్ని చట్టాలను, FDI విధానాలను ఉల్లంఘించి భారత్‌లో గుత్తాధిపత్య మార్కెట్ కోసం ప్రయత్నిస్తోందని CAIT ఆరోపిస్తోంది.

English summary

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ టాప్ సెల్లర్స్‌పై CCI దాడులు, స్వాగతించిన CAIT | CCI raids Amazon, Flipkart seller offices: CAIT welcomes the move

Traders’ body, Confederation of All India Traders has welcomed the ongoing raids by the Competition Commission of India at some of the top seller offices of Amazon India and Flipkart.
Story first published: Friday, April 29, 2022, 9:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X