ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువు తేదీని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) బుధవారం తెలిపింది.

వారందరికీ వర్తిస్తుంది
2018-19 ఆర్థికసంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నామని, కరోనా కారణంగా తలెత్తుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్ 2019-20) రిటర్న్స్ దాఖలు తేదీని జూలై 31వ తేదీ నుండి సెప్టెంబర్ 31 వరకు సీబీడీటీ పొడిగించిందని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. 2018-19కి సంబంధించి అసలు, సవరించిన రిటర్న్స్ దాఖలు చేసే వారందరికి పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

పొడిగింపు మూడోసారి
కరోనా నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఇలా వెసులుబాటు కల్పిస్తూ గడువును పొడిగించడం ఇది మూడోసారి. 2020 మార్చి 31వ తేదీగా గడువు ఉంది. దీనిని తొలుత జూన్ 30వ తేదీకి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా ఇబ్బందులు, లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో జూలై 31వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇప్పుడు మూడోసారి సెప్టెంబర్ 30 వరకు డెడ్ లైన్ విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

వీటికీ గడువు పెంపు..
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఇండివిడ్యువల్ ఎవరైనా గడువులోగా (ప్రస్తుతం సెప్టెంబర్ 30) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయలేరు. ఈ డెడ్ లైన్‌లోగా సవరించిన ఐటీఆర్‌ను కూడా ఫైల్ చేయవచ్చు. ఇంతకుముందు ఫైల్ చేసిన రిటర్న్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేయవచ్చు. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని నవంబర్ 30వ తేదీకి పొడిగిస్తూ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. సాధారణంగా జూలై 31 లోపు దాఖలు చేయాలి. కరోనా నేపథ్యంలో దీనిని కూడా పొడిగించారు. 2015-16 నుండి 2019-20 వరకు ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications