న్యూయార్క్: కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ వ్యాపారం ఊపందుకుంది. దీంతో ఈ-కామర్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకుంటున్నాయి. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అమెరికా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. కెరీర్ డే పేరుతో త్వరలో వేలాది ఉద్యోగులను తీసుకోనుంది. వచ్చే కొద్ది నెలల్లో కార్పోరేట్, టెక్ బాధ్యతలు నిర్వహించడం కోసం 33,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. కరోనా సమయంలో దూసుకెళ్తున్న కంపెనీల్లో అమెజాన్ ముందుంది.

ఇప్పటికే 1.75 లక్షల మంది నియామకం
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో భారత్ సహా వివిధ దేశాల్లో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లోనే నిత్యావసర వస్తువులు సహా అన్నింటిని తెప్పించుకుంటున్నారు. అందుకే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెజాన్ రికార్డ్‌స్థాయి ఆదాయాలను నమోదు చేసింది. డిమాండ్ పెరగడంతో వస్తువులను వేగంగా డెలివరీ చేసేందుకు తన వేర్ హౌస్‌లలో లక్షా డెబ్బై అయిదువేల మందిని నియమించుకుంది. ఇప్పుడు మరోసారి నియామకాలు చేపట్టనుంది.

గంటకు రూ.1100కు పైగా..
తాజా నియామకాల కోసం సెప్టెంబర్ 16వ తేదీన అమెజాన్ కెరీర్ డేతో ఆన్‌లైన్ కెరీర్ ఫెయిర్‌ను నిర్వహించనుంది. కార్పోరేట్, టెక్ బాధ్యతల కోసం అమెరికాలో 33,000 మందిని తీసుకోనుంది. అమెజాన్ కెరీర్ డే సందర్భంగా 1,000 మంది రిక్రూటర్స్ 20,000 కెరీర్ కోచింగ్ సెషన్స్ నిర్వహిస్తారని అమెజాన్ తెలిపింది. ఈ సెషన్లు ఉచితం. అలాగే అమెజాన్‌లో 33వేల ఓపెనింగ్స్ ఉన్నాయని, అమెజాన్ ఆపరేషన్స్ నెట్ వర్క్‌లో వేలాది అదనపు గంటల వర్క్ ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం కొత్త ఉద్యోగులను తీసుకుంటామని, గంటకు కనీసం 15 డాలర్లు (రూ.1,100కు పైగా) ఉంటుందని, 20 వారాల పేరెంటల్ లీవ్ ఉంటుందని తెలిపింది.

అమెరికన్లకు వేలాది ఉద్యోగాలు..
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా(అమెరికా) మిలియన్ల మంది ప్రజలను ప్రభావితమయ్యారని, ప్రజలు తిరిగి పనిలోకి వచ్చే అవకాశం కోసం ఆసక్తిగా ఉన్నారని అమెజాన్ మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టీ ఓ ప్రకటనలో తెలిపారు. గత దశాబ్ద కాలంలో అమెరికాలో ఇతర కంపెనీల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించామని, అన్ని నేపథ్యాల నుండి, అన్ని నైపుణ్యస్థాయిల్లోని వ్యక్తులను నియమించుకుంటామని తెలిపారు. అమెజాన్‌లో కార్పోరేట్, టెక్ ఖాళీల కోసం తీసుకునే ఈ కొత్త ఉద్యోగులకు సగటున 1,50,000 డాలర్లు వస్తుందని, ఇందులో స్టాక్ ఆధారిత కంపెన్షేషన్, ఇతర ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది. కరోనా కారణంగా నిరుద్యోగులుగా మారిపోయిన, కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి కెరీర్ డే ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications