For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు

|

ఏటీఎం నుండి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే డెబిట్ కార్డు ఇంటి వద్దనే మరిచిపోయారా? అయినా పర్వాలేదు. డబ్బులు డ్రా చేసుకోవడానికి వెంట డెబిట్ కార్డు ఉండవలసిన అవసరం లేదు. మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉండి, అందులో యూపీఐ ఆధారిత గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే ఉంటే చాలు. సులభంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు డబ్బులు ఏటీఎంలలో మార్పులు చేస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.

కస్టమర్లు సమీపంలోని ఏటీఎంకు వెళ్లి స్మార్ట్ ఫోన్ సాయంతో నగదును ఉపసంహరించుకోవచ్చు. ఈ సేవను పొందాలంటే ఆ ఏటీఎం యంత్రం యూపీఐ సర్వీస్‌ను సపోర్ట్ చేస్తుండాలి. ఏటీఎం మెషీన్‌లో విత్ డ్రా ఆప్షన్ ద్వారా నగదును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్ పైన యూపీఐ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఫోన్‌లో యూపీఐ యాప్‌ను తెరిచి ఏటీఎం స్క్రీన్ పైన ఉన్న కోడ్‌ను స్కాన్ చేయాలి. స్కాన్ అయ్యాక ఎంత ఉపసంహరించుకోవాలనేది టైప్ చేయాలి.

Cardless cash withdrawal From ATM

ప్రస్తుతానికి ఇది రూ.5,000 వరకు గరిష్ఠ పరిమితి. అంతకుమించి ఉపసంహరించుకోవడానికి వీల్లేదు. ఆ తర్వాత ఏటీఎం పిన్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయి నగదు వస్తుంది.

English summary

కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు | Cardless cash withdrawal From ATM

If you have a bank account with the State Bank of India (SBI), you will be able to avail the facility to make a 'cardless transaction' through the ATM.
Story first published: Tuesday, May 17, 2022, 17:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X