For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్, ఎథేరియం మళ్లీ ఢమాల్, 7 రోజుల్లో 40% ఎగిసిన కార్డానో

|

క్రిప్టో కరెన్సీ మంగళవారం క్షీణించింది. ఈ వార్త రాసే సమయానికి క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 1.46 శాతం లేదా 615 డాలర్లు క్షీణించి 41,598.80 డాలర్ల వద్ద, ఎథేరియం 4.7 శాతం తగ్గి 3116 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డోజీకాయిన్ కూడా 4.6 శాతం మేర పతనమై 0.1627 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌తో పోలిస్తే 2.26 శాతం క్షీణించి 2.02 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 21.51 శాతం ఎగిసి 77.49 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

భారత కరెన్సీ వ్యాల్యూలో బిట్ కాయిన్ 0.94 శాతం క్షీణించి రూ.33,76,785 వద్ద, ఎతేరియం 2.65 శాతం తగ్గి రూ.2,57,489 వద్ద ట్రేడ్ అయింది. అవాలాంచె 3.95 శాతం క్షీణించి రూ.6,938.36 వద్ద, పోల్కాడాట్ 3.06 శాతం తగ్గి రూ.2,064.73 వద్ద ట్రేడ్ అయింది. అయితే లైట్ కాయిన్ 0.69 శాతం పెరిగి రూ.11,949 డాలర్ల వద్ద, టెథెర్ 0.43 శాతం ఎగిసి రూ.79.9 వద్ద, కార్డానో అయితే ఏకంగా 10.88 శాతం లాభపడి రూ.127.40 వద్ద ట్రేడ్ అయింది. ఇక మీమ్ కాయిన్ షిబా ఇను 3.28 శాతం, డోజీకాయిన్ 2.45 శాతం నష్టపోయాయి. టెర్రా 9.01 శాతం తగ్గి రూ.6200 వద్ద ట్రేడ్ అయింది.

bitcoin,

ప్రముఖ క్రిప్టో కార్డానో కేవలం ఏడు రోజుల్లోనే 40 శాతం ఎగిసిపడింది. ఓ వైపు బిట్ కాయిన్, ఎథేరియం, సోలానో, ఎక్స్‌పీఆర్ 5 శాతం మేర క్షీణించగా, కార్డానో మాత్రం మూడొంతుల కంటే ఎక్కువగా లాభపడింది.

English summary

బిట్ కాయిన్, ఎథేరియం మళ్లీ ఢమాల్, 7 రోజుల్లో 40% ఎగిసిన కార్డానో | Cardano surges over 40% in 7 days, Bitcoin dips, Ethereum declines

Cardano surged 10.88 percent to Rs 127.40 and Avalanche declined 3.95 percent to Rs 6,938.36. Bitcoin fell 0.94 percent to trade at Rs 33,76,785 while Ethereum dipped 2.65 percent to Rs 2,57,489.5.
Story first published: Tuesday, January 18, 2022, 21:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X