For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు మీరే బాస్ అయితే... ఈ పాలసీ ఉండి తీరాల్సిందే!

|

ఎవరికి వారు తమ సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఏదో సాధించాలి అని అనుకునే ఉద్యోగస్తులు ఏదో ఒక సమయంలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి సొంత వ్యాపారాలు మొదలు పెడతారు. కొందరు ఎడ్యుకేషన్ అవగానే అక్కడ ఇక్కడ ఉద్యోగంలో చేరటం ఎందుకు ... మనమే సొంతంగా ఏమైనా పని చేసుకుందాం అని అనుకుకువారు కూడా ఉంటారు. మొత్తంగా ఇలాంటి వారు ఉండబట్టే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా... కోట్ల మంది నిరాశ పడకుండా తమ కాళ్లపై తామే నిలబడి జీవనం సాగిస్తున్నారు. మరో పది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

స్వయం ఉపాధి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ఒక్కో సారి అంత ప్రమాదకరంగా కూడా పరిణమిస్తుంది. ముఖ్యంగా ఏదైనా అనుకోని సందర్భంలో బిజినెస్ సరిగ్గా నడవక పోతే.. రావాల్సిన సమయానికి డబ్బులు రాకపోతే ఇలాంటి వారు సంక్షోభంలోకి వెళ్ళిపోతారు. తమ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేరు. రుణాలకు ఈఎంఐ లు కట్టలేరు. ఫలితంగా అనేక బాధలు పడతారు. ఒక్కోసారి బిజినెస్ ను పూర్తిగా మూసేయాల్సిన పరిస్థితి కూడా దాపురిస్తుంది. అలాంటి సందర్భంలో బిజినెస్ ఓనర్ చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఒత్తిడి తట్టుకోలేక వారు తీవ్ర మైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సందర్భంలో వారినే నమ్ముకున్న కుటుంబం మరింత సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది.

Buy a term policy to mitigate their risk

మరికొన్ని సార్లు బిజినెస్ యజమానికి ప్రమాదవ వశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే? మరణం సంభవిస్తే...? అలాంటి సందర్భంలోనూ కుటుంబం కష్టాలపాలు అవుతుంది. ఒకవైపు ఇంటి పెద్దను కోల్పోతే.. మరో వైపు బిజినెస్ కోసం తీసుకున్న రుణాలు తీర్చాలంటూ బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు ఆ కుటుంబంపై ఒత్తిడి పెంచుతాయి. ఇది రెండు రకాలుగా ఇబ్బందులను కొని తెస్తుంది. అందుకే, ఇలాంటి సంక్షోభాలను సమర్థవంతహంగా ఎదుర్కొనేందుకు స్వయం ఉపాధి పొందేవారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తప్పని సరిగా టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు.

టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు...
- టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్కును అందించే సాధనం. రూ 10,000 లతో రూ 1 కోటి విలువైన పాలసీ ని కూడా కొనుగోలు చేయవచ్చు.

- బిజినెస్ యజమానికి రోడ్డు ప్రమాదం జరిగి మరణం సంభవించింది అనుకుందాం. అప్పుడు అయన పై ఆధారపడిన భార్య/ నామినీకి రూ 1 కోటి అందజేస్తారు. ఈ మొత్తం ఆ కుటుంబం తమ జీవనం సాఫీగా సాగిపోయేందుకు ఉపయోగపడుతుంది.
-ఒకవేళ బిజినెస్ యజమాని గనుక తన వ్యాపారం కోసం పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఉండి, వాటిని ఇంకా తిరిగి చెల్లించాల్సి ఉన్న సమయంలో కూడా ఈ పాలసీ కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. కొంత సొమ్మును అప్పులు తీర్చేందుకు వినియోగించినా ... మిగితా సొమ్ముతో తమ జీవనం కోసం ఏర్పాట్లు చేసుకోవచ్చు.
-యజమాని చేసిన అప్పులకు కుటుంబం, వారసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి, వీటిని తట్టుకొని నిలబడాలంటే యజమానికి తనకు తగిన టర్మ్ పాలసీ ఎంచుకునే అవసరం ఎంతైనా ఉంటుంది.
-ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడి 90% నికి పైగా శరీరం దెబ్బతిని, మంచానికే పరిమితమైనా కూడా ఈ పాలసీ ప్రయోజనాలు అందుతాయి. అలంటి పరిస్థితిని మరణంతో సమానంగా పరిగణిస్తారు. అందుకే మేచురిటీ చెల్లిస్తారు.
-స్వయం ఉపాధి పొందే వారు తమ వార్షిక ఆదాయానికి 20 రెట్ల మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. అంటే.. సుమారు ఒక వ్యాపారికి సంవత్సరినికి రూ 5 లక్షల ఆదాయం ఉందనుకుంటే... అతను రూ 1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేందుకు అర్హుడు.
-ప్రీమియం కూడా పొదుపు పాలసీలతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. ఒక 30 ఏళ్ళ వయసున్న స్వయం ఉపాధి పొందే వ్యక్తికి మద్యపానం, ధూమపానం అలవాట్లు లేకుంటే రూ 1 కోటి పాలసీ ని రూ 10,000 ప్రీమియం తో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
-అదే 40 ఏళ్ళ వ్యక్తికి ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే గనుక ఇదే పాలసీ కొనుగోలు చేసేందుకు రూ 36,000 వరకు ఖర్చవుతుంది.
-తక్కువ ప్రీమియం ఉండాలనుకునే వారు చిన్న వయసులోనే టర్మ్ పాలసీ తీసుకుంటే మేలు.
-టర్మ్ పాలసీని జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి ) సహా ఇతర ఇన్సూరెన్ కంపెనీలు అందిస్తాయి.

English summary

మీకు మీరే బాస్ అయితే... ఈ పాలసీ ఉండి తీరాల్సిందే! | Buy a term policy to mitigate their risk

Self employed persons, business owners and entrepreneurs are advised to buy a term policy to mitigate their risk. They should buy the high risk cover term policy from LIC or any other insurance company that provides at least Rs 1 crore and above risk in case of sudden death due to accidents or any other reasons. The maturity amount can save the dependents in absence of the head of the family.
Story first published: Monday, March 30, 2020, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X