For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్‌కు టీడీఎస్ మినహాయింపు

|

షేర్లు, కమోడిటీస్ ట్రాన్సాక్షన్స్‌ను ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(TDS) నిబంధన నుండి మినహాయిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీ లేదా కమోడిటీస్ ఎక్స్చేంజీ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్‌కు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఆదాయ పన్ను చట్టంలోని 194Q సెక్షన్ ప్రకారం ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ రూ.50 లక్షలకు మించితే ఆ ట్రాన్సాక్షన్ వ్యాల్యూలో 0.1 శాతాన్ని కొనుగోలుదారు అమ్మకందారు నుండి టీడీఎస్ కింద మినహాయించుకొని ఐటీ శాఖకు చెల్లించాలి. ఇప్పుడు దీనిని మినహాయించింది.

ఈ ట్రాన్సాక్షన్ జరిగేందుకు... ముందు ఆర్థిక సంవత్సరం రూ.10 కోట్లకు పైబడి టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఐటీ శాఖ జూలై 1వ తేదీ నుండి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అయితే టీడీఎస్ కారణంగా స్టాక్ మార్కెట్, కమోడిటీస్ ట్రేడింగ్‌లో సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఐటీ శాఖ చర్యలు తీసుకుంది.

Businesses need not deduct TDS on share purchases via exchanges

కొత్త టీడీఎస్ నిబంధన ప్రకారం బయ్యర్ టర్నోవర్ రూ.10 కోట్ల లోపు ఉంటే టీడీఎస్ 0.1 శాతం (బయ్యర్), బయ్యర్ టర్నోవర్ రూ.10 కోట్లకు పైన ఉంటే టీసీఎస్ 0.1 శాతం(సెల్లర్), బయ్యర్ అండ్ సెల్లర్ టర్నోవర్ రూ.10 కోట్లకు లోపు ఉంటే టీసీఎస్ 0.1 శాతం (సెల్లర్) వర్తిస్తుంది.

English summary

స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్‌కు టీడీఎస్ మినహాయింపు | Businesses need not deduct TDS on share purchases via exchanges

Businesses had said there are practical difficulties in implementing the provisions of TDS contained in a rule.
Story first published: Monday, July 5, 2021, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X