For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani: రాహుల్ గాంధీపై అదానీ ఫైర్.. రాజుకున్న రాజకీయ వేడి.. మరీ ఇంత ఆగ్రహమా..?

|

Adani: రాజకీయ నాయకుల అండ లేకుండా కంపెనీల వ్యాపారాల మనుగడ కష్టతరమని మనందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటుంటారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళ దీనికి సంబంధించిన విషయాలు మళ్లీ చర్చల్లోకి వస్తున్నాయి. ఇంతకీ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

2014 ఎన్నికలు..

2014 ఎన్నికలు..

2014 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ నిరంతరం తమపై దాడి చేస్తున్నారని అదానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారంగా మారాయి. రాహుల్ జీ చేసిన దాడితో ప్రజలకు అదానీ అంటే ఎవరో తెలుసుకున్నారని అన్నారు.

అంతకు ముందు చాలా మంది అదానీ అనే పేరును విని ఉండరని.. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గుజరాత్‌కు చెందినవాడినని.. అక్కడి ప్రజలు తనకు తెలుసునన్నారు. 2014 ఎన్నికలు సమీపించినప్పడు కూడా రాహుల్ గాంధీ పదేపదే తనపై విరుచుకుపడ్డారని ఇంటర్వ్యూలో ప్రశ్నకు బదులిచ్చారు.

గౌరవనీయమైన నేతంటూ..

గౌరవనీయమైన నేతంటూ..

ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ శనివారం స్పందించారు. రాహుల్ గాంధీని గౌరవనీయమైన నేతగా అభివర్ణిస్తూ.. ఆయన కూడా రాజకీయ పార్టీని అలాగే నడపాలని అన్నారు.

అయితే.. మోదీ అండతోనే అదానీ విస్తరిస్తోందని, మోదీ కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారంటూ రాహుల్ గాంధీ పలు మార్లు ఇప్పటికే తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ చాలాసార్లు ఆరోపణలు చేశారు.

ఇంటర్వ్యూలో వ్యాఖ్య..

ఇంటర్వ్యూలో వ్యాఖ్య..

ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ గురించి అడిగిన ప్రశ్నపై గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. రాహుల్‌తో మళ్లీ మళ్లీ గొడవ పడేలా చేస్తారని, రేపు తమపై మరో స్టేట్‌మెంట్ ఇస్తానని గౌతమ్ అదానీ అన్నారు. రాహుల్ జీ గౌరవనీయమైన నాయకుడు. రాజకీయ పార్టీని కూడా నడపాలి. వారి సిద్ధాంతాల యుద్ధం జరుగుతోంది. అందులో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి. నేను సాధారణ వ్యాపారవేత్తను. ఒక వ్యాపారవేత్తంగా నా పని నేను చేసుకుపోతుంటానంటూ అదానీ బదులిచ్చారు.

ప్రధాని మోదీపై అదానీ..

ప్రధాని మోదీపై అదానీ..

దీనికి ముందు ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ గురించి అడిగిన ప్రశ్నలకు సైతం అదానీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మెుదటగా తన ప్రస్థానం 1985లో రాజీవ్ గాంధీ తెచ్చిన ఎగ్జిమ్ పాలసీ తన కంపెనీని గ్లోబల్ ట్రేడింగ్ హౌస్‌గా మార్చేందుకు సహాయపడిందని అన్నారు. ఆ తర్వాత పివి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు చివరగా మోదీ సర్కార్ లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తెస్తున్న పాలసీలు వ్యాపార విస్తరణకు అవకాశాలను తెచ్చిపెట్టాయని అన్నారు.

అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీ నుంచి ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలను పొందలేదని.. జాతీయ ప్రయోజనాల కోసమే కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చే పాలసీలు దేశంలోని అందరు వ్యాపారవేత్తలకూ ప్రయోజనాన్ని కల్పించేందుకు రూపొందిస్తున్నవని అన్నారు.

Read more about: gautam adani adani rahul gandhi
English summary

Adani: రాహుల్ గాంధీపై అదానీ ఫైర్.. రాజుకున్న రాజకీయ వేడి.. మరీ ఇంత ఆగ్రహమా..? | Business Tycoon Gautam Adani Fired over Rahul gandhi know complete details

Business Tycoon Gautam Adani Fired over Rahul gandhi know complete details..
Story first published: Sunday, January 8, 2023, 10:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X