భారతీయ కంపెనీలు సొంత టెక్నాలజీని నిర్మించుకోవాలని, ఇండియన్ సీఈవోలు సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ఆయన సోమవారం ముంబైలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సమ్మిట్‌లో మాట్లాడారు. ఇండియన్ బిజినెస్ లీడర్స్‌కు హితబోధ చేశారు.

టెక్నికల్ కేపబులిటీ
డిజిటల్ యుగంలో ముందుకు సాగాలంటే బిజినెస్ లీడర్స్, సీఈవోలు అందరూ తమ సొంత టెక్నికల్ కేపబులిటీని పెంపొందించుకోవాలన్నారు. ప్రకృతిలో మిళితమై ఉన్న సామర్థ్యాలను ఇండియన్ సీఈవోలు అలవర్చుకోవాలని సూచించారు. గత దశాబ్ద కాలంలో ఎన్నో మార్పులు వేగంగా చోటు చేసుకున్నాయన్నారు.

టెక్నాలజీ పరిశ్రమకు బయట
అగ్రిగేటర్లు దూసుకెళ్లాయని, కానీ అవి సరిపోవన్నారు. డిజిటల్ జోక్యం ఉత్పాదక సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఉపయోగపడుతుందని గుర్తించాలన్నారు. భారతదేశంలో 72 శాతం సాఫ్టువేర్ ఇంజినీర్ ఉద్యోగులు టెక్నాలజీ పరిశ్రమకు వెలుపల ఉన్నాయన్నారు.

ఇదే చెబుతాను..
ఇతర ఇండస్ట్రీస్‌కు చెందిన సీఈవోలతో మాట్లాడినప్పుడు కూడా సొంత సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తాను చెబుతానని అన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ మరింత ముఖ్యమని, అందుకే ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. వచ్చే దశాబ్దంలో అత్యంత ప్రాధాన్యతను కలిగిన టెక్నాలజీలో తమ సొంత టెక్నాలజీ సామర్థ్యాన్ని నిర్మించుకోవాలన్నారు.

రాబోయే పదేళ్లలో..
టెక్నాలజీ విషయంలో విమర్శలు వస్తూనే ఉంటాయని, కన్స్యూమర్ ఎకానమీ చాలా ముఖ్యమని సత్య నాదెళ్ల చెప్పారు. కానీ ఇది ఆర్థిక అంశానికి సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు. రాబోయే పదేళ్లలో విస్తృతమైన ఉత్పాదక అవసరమని, డిజిటల్ టెక్నాలజీ మారుతుందన్నారు. ఇండియన్ స్టార్టప్స్ నిర్మించిన అగ్రిగేటర్ బిజినెస్ మోడల్ విజయవంతమైందన్నారు.

శిక్షణ అవసరం..
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్య శిక్షణలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలోని యువతకు అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయని, అలాగే త్వరగా నేర్చుకునే తత్వం వారి సొంతమని, దానిపై వారికి శిక్షణ అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తదితరులు పాల్గొన్నారు.

సీఈవోలు ఏమన్నారంటే..
2020 నాటికి ఎగైల్ టెక్నాలజీలని పూర్తిగా స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ డెవలపర్‌లలో 59 శాతం మంది ప్రస్తుతం ఎగైల్‌పై పని చేస్తున్నారని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపినాథన్ వెల్లడించారు. భారత్ ప్రీమియమ్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశముందని ముఖేష్ అంబానీ అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications