For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2022: హోమ్‌లోన్ వడ్డీపై పన్ను డిడక్షన్ రూ.5 లక్షలకు పెంచుతారా?

|

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల కారణంగా ఈ బడ్జెట్ పైన ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. గత రెండేళ్లుగా ప్రజల చేతిల్లో డబ్బులు లేక రియాల్టీ రంగం క్షీణించింది. అయితే కేంద్ర, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల పన్ను మినహాయింపులు లేదా పన్ను తగ్గింపులు, రియాల్టర్ల ఆఫర్ల నేపథ్యంలో గత కొద్ది నెలలుగా రియాల్టీ పుంజుకుంటోంది. ఇటీవలే దాదాపు కరోనా ముందుస్థాయి సమీపానికి చేరుకుంది. కరోనా కారణంగా రియాల్టీ రంగం కూడా దెబ్బతిన్నదని, దీనికి ఊతమిచ్చేలా బడ్జెట్‌లో పలు చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.

ఈ డిమాండ్లతో పాటు ఆశలు

ఈ డిమాండ్లతో పాటు ఆశలు

2021 క్యాలెండర్ ఏడాదిలో హౌసింగ్ సేల్స్ కరోనా ముందుస్థాయితో పోలిస్తే 90 శాతానికి చేరుకున్నాయి. కొత్త లాంచింగ్స్ 2019 స్థాయికి చేరాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరోసారి రియాల్టీ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ పైన ఈ రంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇండస్ట్రీ స్టేటస్, ఈజీ ఫైనాన్స్, జీఎస్టీ రేటు తగ్గింపు వంటి ప్రధాన డిమాండ్లతో పాటు రియాల్టీ రంగానికి మరింత ఊతమిచ్చే చర్యలు ఉంటాయని భావిస్తున్నట్లు అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి అన్నారు. వచ్చే బడ్జెట్‌లో రియాల్టీ రంగానికి ఊతమిస్తే రెసిడెన్షియల్ డిమాండ్ మరింత పుంజుకుంటుందన్నారు.

అప్పుడు హౌసింగ్ డిమాండ్

అప్పుడు హౌసింగ్ డిమాండ్

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లపై రూ.2 లక్షల వరకు పన్ను రాయితీని కనీసం రూ.5 లక్షలకు పెంచాలని అనుజ్ పూరి అన్నారు. అలా చేస్తే హౌసింగ్ కోసం బలమైన డిమాండ్ కనిపిస్తుందని చెప్పారు. ప్రత్యేకించి సరసమైన, మిడ్-సెగ్మెంట్ వర్గాలకు ఇది ఊతమిస్తుందన్నారు.

ప్రాపర్టీ వాటాదారులు హోమ్ లోన్స్ పైన చెల్లించే వడ్డీపై స్టాండర్డ్ తగ్గింపు రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారని స్క్వేర్ యార్డ్ వ్యవస్థాపకులు, సీవోవో కనిక గుప్తా షోరి అన్నారు. ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే హౌసింగ్ డిమాండ్ పెరుగుతుందన్నారు.

ఈ మినహాయింపు కూడా

ఈ మినహాయింపు కూడా

అలాగే, ఆదాయపు పన్ను మినహాయింపు విషయానికి వస్తే ఇంటి రుణంలో చెల్లిస్తున్న ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద డిడక్షన్‌కు అవకాశముంది. ప్రతి సంవత్సరం గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పరిమితి ఉంది. ఇదే 80సీ సెక్షన్ కింద పీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లింపులకు ఐటీ రిటర్న్స్ క్లెయిమ్ చేయవచ్చు. కానీ ఇదే సెక్షన్ కింద ఇతర బెనిఫిట్స్ పొందడానికి అవకాశం లేదు. 2014 నుండి ఇళ్ల రుణాలపై పన్ను మినహాయింపు పరిమితి పెంచలేదు.

English summary

Budget 2022: హోమ్‌లోన్ వడ్డీపై పన్ను డిడక్షన్ రూ.5 లక్షలకు పెంచుతారా? | Budget expectation: Rs 5 lakh Income Tax deduction on Home Loan interest

The real estate sector witnessed a strong comeback last year as housing sales in top cities jumped to 90% of the pre-covid levels while newly launched units reached the 2019 levels.
Story first published: Tuesday, January 18, 2022, 16:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X