For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2022 date, time : చరిత్రలో అదే లాంగెస్ట్ బడ్జెట్ ప్రసంగం

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. జనవరి 31న వర్చువల్ రూపంలో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మోడీ 2.0 ప్రవేశ పెడుతున్న నాలుగో బడ్జెట్ ఇది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ బడ్జెట్ పైన ఎన్నో అంచనాలు ఉన్నాయి. అన్ని రంగాలు కూడా తమకు ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ గురించి కొన్ని సంగతులు...

బడ్జెట్ ముఖ్యాంశాలు

బడ్జెట్ ముఖ్యాంశాలు

- 2019లో అపూర్వ మెజార్టీతో గెలుపొందిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంటే మోడీ 2.0కు ఇది నాలుగో బడ్జెట్.

- జనవరి 31వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నారు.

- నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం 90 నిమిషాల నుండి 120 నిమిషాల వరకు ఉండవచ్చునని అంచనా.

- స్వతంత్ర భారత చరిత్రలో 2020 బడ్జెట్ ప్రసంగం అతి పెద్దది. ఈ బడ్జెట్ ప్రసంగం గం.2.40 నిమిషాల పాటు కొనసాగింది. 160 నిమిషాల పాటు ప్రసంగించిన తర్వాత కూడా ఈ బడ్జెట్ ప్రతులు చదవడం పూర్తి కాలేదు. చివరి రెండు పేజీలు పూర్తి కాలేదు.

బడ్జెట్ ప్రసంగం ఇలా చూడండి

బడ్జెట్ ప్రసంగం ఇలా చూడండి

యూనియన్ బడ్జెట్ 2022 లైవ్ బ్రాడ్ కాస్టింగ్ లోకసభ టీవీలో వస్తుంది. న్యూస్ ఛానల్స్ ఇక్కడి నుండి తీసుకుంటాయి. యూట్యూబ్, ట్విట్టర్ వంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా చూడవచ్చు.

ఎన్నో ఆశలు

ఎన్నో ఆశలు

- కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగవంత రికవరీకి అవసరమైన చర్యలు ప్రకటిస్తారని భావిస్తున్నారు.

- మరిన్ని కరోనా ఔట్ బ్రేక్స్‌ను ఎదుర్కొనేలా హెల్త్ కేర్ సిస్టం పైన మరింత దృష్టి సారించనున్నారు.

- ఆర్థిక రికవరీ వేగవంతం చేయడానికి హోమ్ లోన్ పైన మరిన్ని ట్యాక్స్ బెనిఫిట్స్, అఫోర్డబుల్ హౌసింగ్ పరిమితి పెంపు, రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని మార్పులు, రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు, టెక్ అడాప్షన్, చిన్న కంపెనీలకు చేయూత, వేతన జీవులకు పన్ను మినహాయింపులు మొదలు వివిధ చేయూత.. ఇలా వివిధ రంగాలకు ఊతమిచ్చే ప్రకటనలు రావొచ్చు.

English summary

Budget 2022 date, time : చరిత్రలో అదే లాంగెస్ట్ బడ్జెట్ ప్రసంగం | Budget 2022 date, time here: some expecting in Nirmala speech?

The budget is presented every year by the Finance Minister. This year Finance Minister Nirmala Sitharaman will introduce the fourth Budget of the Modi 2.0 government. The budget will be presented on February 1, 2022.
Story first published: Wednesday, January 26, 2022, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X