For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2021: బడ్జెట్ రోజున గత 10 ఏళ్లలో సెన్సెక్స్, 2020లో భారీ పతనం

|

ముంబై: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి కొద్ది రోజుల ముందు, బడ్జెట్ రోజు, ఆ తర్వాత మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. బడ్జెట్‌కు ముందు అంచనాలకు అనుగుణంగా సెన్సెక్స్, నిఫ్టీలు కదలాడుతాయి. బడ్జెట్ రోజు కేంద్ర ఆర్థికమంత్రి ప్రసంగాన్ని బట్టి కదలాడుతాయి. ఈసారి కరోనా నేపథ్యంలో బడ్జెట్ పైన అన్ని రంగాలు, అన్ని వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.

వివిధ కారణాలతో గత ఆరు సెషన్లలో సూచీలు కుప్పకూలాయి. ఈ కాలంలో సెన్సెక్స్ ఏకంగా 4000 పాయింట్లు నష్టపోయింది. నిర్మలమ్మ రేపు (ఫిబ్రవరి 1, సోమవారం) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి

గత 10 బడ్జెట్‌ల కాలంలో ఇలా

గత 10 బడ్జెట్‌ల కాలంలో ఇలా

గత పది సంవత్సరాల్లో బడ్జెట్ సమయంలో మార్కెట్లు ఆరుసార్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇందులో రెండుసార్లు (2012, 2013) 1 శాతం కంటే తక్కువ నష్టపోయాయి. 2020 బడ్జెట్ సమయంలో సెన్సెక్స్ 2.4 కుప్పకూలింది. 2009లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత సూచీలు అత్యంత దారుణంగా కుప్పకూలింది గత ఏడాది మాత్రమే. గత పదేళ్లలో వరస్ట్ ప్రదర్శన 2020లో నమోదయింది.

వరుసగా నష్టాల్లో..

వరుసగా నష్టాల్లో..

2012-13 బడ్జెట్ రోజు సూచీలు 1.19 శాతం నష్టపోయాయి. సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ వరుసగా 10 శాతం నుండి 12 శాతం పెంచిన అనంతరం మార్కెట్లు నష్టపోయాయి. ఇది చమురు మార్కెట్ పైన ప్రభావం చూపింది.

2013లో సెన్సెక్స్ 1.5 శాతం లేదా 291 పాయింట్లు నష్టపోయింది. నాడు 19000 పాయింట్ల దిగువన సెన్సెక్స్ ముగిసింది.

2014లో సెన్సెక్స్ 028 శాతం నష్టపోయింది. వరుసగా మూడో సంవత్సరం బడ్జెట్ రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

2015లో బడ్జెట్ రోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. అఫ్పుడు జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించడం ప్రభావం చూపింది.

చివరి బడ్జెట్ భారీ నష్టాల్లో

చివరి బడ్జెట్ భారీ నష్టాల్లో

2016లో బడ్జెట్ రోజున సెన్సెక్స్ 0.66 శాతం నష్టపోయింది. 2017లో సెన్సెక్స్ 486 పాయింట్లు ఎగిసి 28,000 మార్కు దాటింది. ఆ సెషన్‌లో ఓ సమయంలో సెన్సెక్స్ 1.76 శాతం కూడా లాభపడింది. 2010 నుండి ఓ బడ్జెట్ రోజున ఈ మేరకు ఎగిసిపడటం ఇదే మొదటిసారి.

2018లో సూచీలు 0.16 శాతం నష్టపోయాయి. గత పదేళ్లలో ఇది 8వసారి. 2019లో బడ్జెట్ రోజున సెన్సెక్స్ 0.59 శాతం లాభపడింది.

2020 బడ్జెట్ సమయంలో సెన్సెక్స్ 2.4 కుప్పకూలింది.

English summary

Budget 2021: బడ్జెట్ రోజున గత 10 ఏళ్లలో సెన్సెక్స్, 2020లో భారీ పతనం | Budget 2021: How Sensex, Nifty moved on Budget Day in last ten years

The domestic stock market has witnessed high volatility during most Union Budget announcements in the last 10 years.
Story first published: Sunday, January 31, 2021, 7:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X