భారత ఆర్థిక రంగానికి నిర్మలా సీతారామన్ వ్యాక్సీన్!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (సోమవారం, ఫిబ్రవరి 1) ఉదయం గం.11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో సొంతకాళ్లపై నిలబడే లక్ష్యంతో ఈ బడ్జెట్‌ను తీసుకు వస్తున్నారు. కరోనా కారణంగా వివిధ రంగాలకు ప్యాకేజీలు ప్రకటిస్తూ ఐదారు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. దానికి కొనసాగింపుగా ఈ బడ్జెట్ ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు నిర్మలమ్మ బడ్జెట్ వ్యాక్సీన్‌లా పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
ఈసారి ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఆదాయ పరిమితి పెంపుపై వేతనజీవులకు ఊరట ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గరిష్ట పన్ను స్లాబ్స్‌లోని వారికి కరోనా సెస్ ఉండవచ్చు. రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రూ.8 వేలకు పెంచే అవకాశముంది. హెల్త్ రంగానికి కేటాయించే నిధులు జీడీపీలో 2 శాతానికి పెంచే అవకాముంది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించవచ్చు. తయారీరంగ ప్రోత్సాహానికి ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చు.

వ్యవసాయరంగ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తారు. బంగారం దిగుమతులపై సుంకాల తగ్గించవచ్చు. దేశీయంగా వైద్య, విద్యుత్తు ఉపకరణాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్, రక్షణ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు ప్రకటిస్తారు. కిసాన్ రైలు, విమాన సేవల విస్తృతిని ప్రకటించవచ్చు. రైలు, రహదారుల నిర్మాణానికి ధాన్యమిస్తారు. ప్రత్యామ్నాయ ఇంధనం, విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహమిస్తారు. కొత్త బుల్లెట్ రైలు మార్గాలు ప్రకటించవచ్చు. వంట గ్యాస్ పైన సబ్సిడీ పెంపవచ్చు. వ్యవసాయరంగంలో ప్రయివేటు పెట్టుబడులకు ప్రోత్సాహాలు ప్రకటిస్తారు.