న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. మందగమనానికి గల కారణాల్లో వినిమయం తగ్గడం. ముఖ్యంగా గ్రామీణ, నగర ప్రాంతాల్లో వినిమయం తగ్గింది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌తో పాటు ఆదాయపు పన్నును సమీక్షించడం ద్వారా ప్రజల్లో వినిమయ శక్తి పెంచాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వచ్చాయి.

వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటు తగ్గింపుతో పాటు..
కార్పొరేట్ వర్గాలకు రూ.1.45 లక్షల కోట్ల మేర పన్ను ఊరట కల్పించిన కేంద్రం ఈసారి వ్యక్తిగత ఆదాయ పన్ను (పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్) చెల్లింపుదారులకు భారీ ఊరట కల్పించనుందని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను రేట్లతో పాటు ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన ఆర్జిత పన్ను (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్) సైతం తగ్గించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేందుకు..
వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయపు పన్ను రేట్లు తగ్గించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించినప్పటి నుంచి ఈ ప్రచారం సాగుతోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ అలాంటి ప్రచారమే సాగుతోంది. ఆదాయపు పన్ను రేట్లను సమీక్షించే అంశంపై ఆర్థిక నిపుణులతో చర్చిస్తున్నామని, ప్రస్తుత మందగమన పరిస్థితుల్లో ప్రజల చేతుల్లో ఎక్కువ మనీ ఉండే అంశంపై ఆలోచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారని అంటున్నారు.

ఆర్థిక నిపుణుల సూచన
డిమాండ్ పెంచి, భారత ఆర్థిక వ్యవస్థను వృద్ధి మార్గం పట్టించేందుకు పలువురు నిపుణులు వివిధ సూచనలు చేశారు. ఇందులో భాగంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కూడా సూచిస్తున్నారు. వృద్ధి రేటు రెండో క్వార్టర్‌లో 4.5తో ఆరేళ్ల కనిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏడాది క్రితం ఇదే క్వార్టర్‌లో 7 శాతంగా ఉంది.

వీటికీ ఊరట
మరోవైపు, ఇబ్బందుల్లో ఉన్న NBFCలకు ఉద్దీపనల ద్వారా, దేశీయంగా పెట్టుబడులు, తయారీని ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలు పెంచే యోచన కూడా ఉందని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కు తగ్గించింది. కొత్త తయారీ యూనిట్లకైతే 15%కి తగ్గింది.
More From GoodReturns

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications