For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2020: 2021 నామినల్ జీడీపీ 10 శాతం.. మోడీ ప్రభుత్వం అంచనా

|

న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వృద్ధి రేటు ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే ఏడాది కాలంగా అంతర్జాతీయంగా, దేశంలో ఆర్థిక మందగమనం ఉంది. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు క్వార్టర్‌లలో వృద్ధి రేటు 5 శాతానికి, 4.5శాతానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతంగా ఉంటుందని అంచనా.

2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని అంచనా వేశాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అంతకంటే తక్కువే ఉంటుందని చెబుతున్నాయి. ఇక, 2020-21వ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కాస్త పుంజుకుంటుందని, 6 శాతం నుంచి 7 శాతం వరకు ఉండవచ్చునని వివిధ ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి.

 Budget 2020: Govt estimate of nominal GDP growth of 10% for 2021

ఇదిలా ఉండగా నామినల్ జీడీపీ 10 శాతంగా ఉంటుందని మోడీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ద్రవ్యలోటు 7.67 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 2020 జీడీపీలో ఇది 3.8 శాతం. 2021 జీడీపీలో 3.5 శాతం. 20219-20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1 లక్ష కోట్ల రెవెన్యూ పెంచుకోవాలని చూసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, రానున్న ఆర్థిక సంవత్సరానికి దీనిని రూ.2.1 లక్షల కోట్లకు పెంచుకుంది.

Budget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదాBudget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదా

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ఆమె ప్రస్తావించారు. దేశ భద్రతే ప్రథమ కర్తవ్యం అన్నారు. రోగరహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత అని తిరువళ్లూరు చెప్పిన సూత్రాలు పేర్కొన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయ జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత వంటి అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు.

English summary

Budget 2020: 2021 నామినల్ జీడీపీ 10 శాతం.. మోడీ ప్రభుత్వం అంచనా | Budget 2020: Govt estimate of nominal GDP growth of 10% for 2021

Government estimated of nominal GDP growth of 10% for 2021. Fiscal deficit at Rs 7.67 lakh crore that is 3.8% of GDP for 2020, 3.5% for 2021.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X