For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ram Navami 2021: నేడు స్టాక్ మార్కెట్లు క్లోజ్

|

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీ బుధవారం స్టాక్ మార్కెట్లకు సెలవు రోజు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (NSE), బీఎస్ఈ రెండూ నేడు క్లోజ్. మెటల్, బులియన్ సహా అన్నీ హోల్ సేల్ కమోడిటీ మార్కెట్లు నేడు కార్యకలాపాలు నిర్వర్తించవు. ఫారెక్స్, కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్ వంటి ట్రేడింగ్ కూడా లేదు. నేడు శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు.

నిన్న సెన్సెక్స్ 243.62 పాయింట్లు లేదా 0.51% క్షీణించి 47,705.80 పాయింట్ల వద్ద, నిఫ్టీ 63.10 పాయింట్లు లేదా 0.44% పతనమై 14,296.40 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిన్న ఉదయం భారీగా లాభపడిన మార్కెట్లు, ఆ తర్వాత సాయంత్రానికి ప్రాఫిట్ బుకింగ్‌కు సిద్ధపడ్డారు. నిఫ్టీ ఆటో, ఫార్మా సూచీలు మాత్రం 1 శాతం మేర పెరిగాయి. ఐటీ సూచీలు ఒక శాతానికి పైగా పడిపోయింది.

BSE, NSE shut today on account of Ram Navami

నిన్నటితో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లో ముగిశాయి. కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయంచడంతో మార్కెట్లలో ఉదయం ఉత్సాహం కనబడింది. అయితే మధ్నాహ్నం తర్వాత ఆవిరయ్యాయి. అదే సమయంలో నిన్నటి భారీ నష్టాల కారణంగా కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు దిగిన ఇన్వెస్టర్లు కాసేపటికి ప్రారంభంలోని లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. మరోవైపు కరోనా కేసులు తగ్గకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బకొట్టింది. దీంతో సూచీలు పతనమయ్యాయి.

English summary

Ram Navami 2021: నేడు స్టాక్ మార్కెట్లు క్లోజ్ | BSE, NSE shut today on account of Ram Navami

The National Stock Exchange of India (NSE) and the BSE will remain closed on April 21 on account of Ram Navami.
Story first published: Wednesday, April 21, 2021, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X