For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ స్టాక్ ధర భారీగా పడిపోనుందా, పెరగనుందా?

|

రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) స్టాక్‌పై వివిధ బ్రోకరేజీ సంస్థలు పలు అంచనాలు ఇచ్చాయి. ఆయిల్ టు టెలికం దిగ్గజం రిలయన్స్ శుక్రవారం త్రైమాసికం ఫలతాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది ప్రాతిపదికన నికర లాభాలు 15 శాతం క్షీణించింది. దీంతో రిలయన్స్ స్టాక్ ఈ రోజు భారీగా క్షీణించింది. నేడు రిలయన్స్ స్టాక్ దాదాపు 9 శాతం పడిపోయి రూ.1,876 వద్ద ముగిసింది. గత కొద్ది నెలలుగా రూ.2,000కు పైగా ఉన్న స్టాక్ ఇప్పుడు ఏకంగా 1900 దిగువకు చేరుకోవడం గమనార్హం.

కుప్పకూలిన రిలయన్స్ షేర్, రూ.2,000 కంటే దిగువకు: నష్టాల్లో మార్కెట్లుకుప్పకూలిన రిలయన్స్ షేర్, రూ.2,000 కంటే దిగువకు: నష్టాల్లో మార్కెట్లు

రిలయన్స్ స్టాక్ టార్గెట్

రిలయన్స్ స్టాక్ టార్గెట్

గతవారం రిలయన్స్ స్టాక్ రూ.2,054 వద్ద ముగిసింది. నేడు ఏకగా రూ.1,876కు దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజీ సంస్థలు రిలయన్స్ స్టాక్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. మాక్వేరీ సంస్థ రిలయన్స్‌కు అండర్ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఇచ్చింది. ఈ విదేశీ కంపెనీ(మాక్వేరీ) దేశీయ దిగ్గజ స్టాక్ పైన హెచ్చరికగా ఉంది. 12 నెలల టార్గెట్ ధరను రూ.1,320 వద్ద నుండి మార్చలేదు. ఎడెల్వీస్ సెక్యూరిటీస్, ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వరుసగా రూ.2,105, రూ.1,970 టార్గెట్ ధరగా పేర్కొన్నాయి.

రూ.2.5 లక్షల కోట్లు సమీకరణ

రూ.2.5 లక్షల కోట్లు సమీకరణ

గత కొంతకాలంగా డిజిటల్‌పై దృష్టి సారించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి కారణాలతో రిలయన్స్ స్టాక్ భారీగా ఎగిసినట్లు బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. జియో ఈపీఎస్ వృద్ధి వంటి వివిధ కారణాలతో రిలయన్స్ రేటింగ్‌ను యథాతథంగా నివేదించినట్లు ఎడెల్వీస్ సెక్యూరిటీస్ తెలిపింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన డిజిటల్, రిటైల్ యూనిట్లలో వాటా అమ్మకాలు, రిలయన్స్ రైట్స్ ఇష్యూ ద్వారా ఏప్రిల్ నుండి రూ.2.5 లక్షల కోట్లు సమీకరించారు. ఇందులో ఇప్పటికే రూ.1.76 లక్షల కోట్లకు పైగా కంపెనీలోకి వచ్చింది. ఈ మొత్తం కంపెనీ జీరో డెబిట్‌కు ఉపయోగపడింది.

గోల్డ్‌మన్ శాక్స్ టార్గెట్

గోల్డ్‌మన్ శాక్స్ టార్గెట్

సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ పెట్రో కెమికల్స్ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 23 శాతం తగ్గి రూ.29,665 కోట్లుగా నమోదయింది. ప్రీ-ట్యాక్స్ ప్రాఫిట్ 33 శాత క్షీణించి రూ.5,964 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ 2 రిఫైనరీస్ ఆదాయం బ్యారెల్‌కు 5.7 డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యారెల్‌కు 9.4 డాలర్లుగా నమోదయింది. ఇక సీఎల్ఎసఏ రిలయన్స్ స్టాక్ టార్గెట్‌ను రూ.2,250గా, గోల్డ్‌మన్ శాక్స్ రూ.2,330గా పేర్కొన్నాయి.

English summary

రిలయన్స్ స్టాక్ ధర భారీగా పడిపోనుందా, పెరగనుందా? | Brokerages offered mixed views on Reliance Industries stock

Brokerages offered mixed views on Reliance Industries (RIL) stock after the oil to telecom behemoth on Friday posted a 15 per cent year-on-year (YoY) drop in net profit attributable to the owners at Rs 9,567 crore for the quarter ended September 30
Story first published: Monday, November 2, 2020, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X