For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Inflation: వ్యభిచారంలోకి మహిళలు.. దిగజారిన పరిస్థితులు.. బ్రిటన్‌లో కనీసం తిండికి లేక ఇలా..

|

Inflation: ఒకప్పుడు భారతదేశాన్ని ఏలిన బ్రిటన్.. ప్రస్తుతం అద్వాన పరిస్థితులను ఎదుర్కొంటోంది. బ్రిటన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనేక మంది మహిళలను వ్యభిచారంలోకి దింపుతోంది. వ్యభిచారం ఇప్పుడు గదులు దాటి వీధుల్లోకి వచ్చింది. ఇంగ్లీష్ కలెక్టివ్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ అనే సంస్థ నివేదికలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యాపారం నుంచి మహిళలను బయటకు తీసుకొచ్చేందుకు సదరు సంస్థ కృషి చేస్తోంది.

తిండికి కూడా కష్టంగా..

తిండికి కూడా కష్టంగా..

ఈ వేసవిలో హెల్ప్‌లైన్‌కు కాల్స్ 33 శాతం పెరిగాయని సంస్థ వెల్లడించింది. ఈ వృత్తిలో చాలా మంది మహిళలు ప్రమాదకరమైన ఖాతాదారులను కలిగి ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఆహారం ఖరీదుగా మారటం, విద్యుత్ బిల్లుల భారంతో మహిళలు ఆందోళన చెందుతున్నారని సంస్థ ప్రతినిధి నిక్కీ ఆడమ్స్ పేర్కొన్నారు. పెరుగుతున్న ఖర్చులు పోషనను భారంగా మారుస్తున్నాయి.

మహిళ తెలిపిన వివరాలు..

మహిళ తెలిపిన వివరాలు..

కనీసం వారానికి ఒకసారి వ్యభిచారంలో పాల్గొన్న ఒక మహిళ ఇటీవల ఇలా చెప్పింది, "నేను వారానికి కనీసం ఒక క్లయింట్‌కి సేవ చేస్తున్నాను. దీని ద్వారా వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె, కరెంటు లేదా గ్యాస్ బిల్లు చెల్లిస్తాను" అని వెల్లడించింది.

UKలో దారుణంగా పరిస్థితులు..

UKలో దారుణంగా పరిస్థితులు..

UKలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ప్రజలు తమ పెంపుడు జంతువులకు ఆహారం కూడా ఇవ్వలేకపోతున్నారు. కుక్కలు, పిల్లుల యజమానులు ఇందుకోసం జంతువుల సంబంధిత సంస్థలను ఆశ్రయిస్తున్నారు. గత నెలలో ఇంగ్లాండ్‌లో 19,500 కుక్కలు, పిల్లులకు RSPCA సంస్థ ఆహారం అందించగా.., జనవరిలో తొమ్మిది వేల జంతువులకు అందించింది. వేల్స్‌లోని పెట్ ఫుడ్‌బ్యాంక్ ఈ సంవత్సరం 46,000 జంతువులకు ఆహారాన్ని పంపిణీ చేసింది.

10 శాతం దాటిన ద్రవ్యోల్బణం..

10 శాతం దాటిన ద్రవ్యోల్బణం..

UKలో ద్రవ్యోల్బణం జులై నెలలో 40 ఏళ్ల గరిష్ఠమైన 10.1 శాతానికి చేరుకుంది. ఇది ఆహారం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిలిచింది. నిత్యావసర ఆహార పదార్థాల వార్షిక ద్రవ్యోల్బణం జూన్‌లో 9.8 శాతం నుంచి 12.7 శాతానికి పెరిగింది. పెరుగుతున్న ఆహార ధరలు, విద్యుత్ అండ్ గ్యాస్ బిల్లులతో ఇబ్బంది పడుతున్న వారు వీధుల్లోకి వచ్చి వ్యభిచారాన్ని ఎంచుకుంటున్నారు.

English summary

Inflation: వ్యభిచారంలోకి మహిళలు.. దిగజారిన పరిస్థితులు.. బ్రిటన్‌లో కనీసం తిండికి లేక ఇలా.. | britan women opting for prostitution to meet expences for living amid rising inflation in uk

britan women opting for prostitution for living amid rising inflation in uk
Story first published: Monday, August 22, 2022, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X