For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీపీసీఎల్ .. ఢిల్లీలో డీజిల్ డోర్ డెలివరీ స్కీమ్ .. సక్సెస్ అయితే దేశమంతటా అమలు

|

మారుతున్న కాలాన్ని బట్టి, వినియోగదారుల అవసరాలను బట్టి, వ్యాపార మెళకువలలో భాగంగా ఇంధన సంస్థలు కూడా మారుతున్నాయి . భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డీజిల్ డెలివరీ స్కీమ్ ను అమలులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పర్వత ప్రాంతాలలో ఈ డీజిల్ డోర్ డెలివరీ స్కీమ్ సక్సెస్ కాగా, ఢిల్లీకి చెందిన స్టార్టప్ సంస్థతో కలిసి సేఫ్ 20 పేరుతో డీజిల్ డోర్ డెలివరీ చేస్తోంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందడి .. మొబైల్స్ పై అదిరిపోయే ఆఫర్ల హంగామా !!అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందడి .. మొబైల్స్ పై అదిరిపోయే ఆఫర్ల హంగామా !!

గతంలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలో డీజిల్ డోర్ డెలివరీ పథకానికి శ్రీకారం చుట్టిన బిపిసిఎల్ అక్కడ మంచి ఫలితాలు రావడంతో, ఆ తర్వాత వ్యవసాయ అవసరాలు ఎక్కువగా ఉండే పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో నూ డీజిల్ డోర్ డెలివరీ పథకాన్ని అమలు చేసింది. ఈ డోర్ డెలివరీ పథకంతో వాహనాలకు కాకుండా ఇతరత్రా అవసరాలకు వినియోగించే ఇంధనాన్ని ఫ్యూయల్ స్టేషన్ నుంచి ప్రయాసతో కూడిన వ్యవహారంగా కాకుండా చాలా ఈజీగా పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ కేంద్రంగా డీజిల్ డోర్ డెలివరీ స్కీమ్ ను అందిస్తోంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.

BPCL .. Diesel Door Delivery Scheme in National capital Delhi

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న హమ్ సఫర్ అనే సంస్థతో టై అప్ అయిన బీపీసీఎల్ 20 లీటర్ల సామర్ధ్యం ఉన్న క్యాన్లలో డీజిల్ ను డోర్ డెలివరీ చేస్తుంది. ఎవరికైనా డీజిల్ కావాల్సి ఉంటే 20 లీటర్ల ఆర్డర్ చెయ్యాల్సిందే. డోర్ డెలివరీ స్కీం వల్ల అపార్ట్మెంట్ లు, సెల్ ఫోన్ టవర్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, బ్యాంకులు, హాస్పిటల్స్, హోటల్స్ వంటి వాటికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీపీసీఎల్ చెబుతోంది.
ఇక ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ స్కీమ్ ప్రస్తుతం ఢిల్లీలో కూడా అమల్లోకి తీసుకువచ్చారు. ఇక్కడ సానుకూల ఫలితాలు వస్తే దేశమంతా విస్తరించి ఆలోచనలో బిపిసిఎల్ వున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా వినియోగదారులకు నేరుగా సేవలందించడానికి ఇంధన సంస్థలు కూడా ముందుకు రావడం నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పొచ్చు.

English summary

బీపీసీఎల్ .. ఢిల్లీలో డీజిల్ డోర్ డెలివరీ స్కీమ్ .. సక్సెస్ అయితే దేశమంతటా అమలు | BPCL .. Diesel Door Delivery Scheme in National capital Delhi

Fuel companies are also changing as part of business practices, depending on changing times and the needs of consumers. It is a known fact that Bharat Petroleum Corporation has implemented a diesel delivery scheme keeping in view the needs of the customers. While the diesel door delivery scheme is already a success in mountainous areas, it is partnering with a Delhi-based startup to deliver diesel doors under the Safe 20 name in national capital delhi.
Story first published: Tuesday, July 27, 2021, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X