For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో బౌన్స్ స్కూటర్ షేరింగ్ సేవలు, కి.మీ.కు రూ.1!

|

హైదరాబాద్: బెంగళూరుకు చెందిన స్కూటర్ షేరింగ్ స్టార్టప్ బౌన్స్ భాగ్యనగరంలో తన రెంటల్ సేవలను మంగళవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి దశలో 2,000 స్కూటర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. జూన్ 2020 నాటికి మొత్తం 10,000 వాహనాలతో తన సేవలను మరింత విస్తరిస్తామని బౌన్స్ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వరుణ్ అగ్ని తెలిపారు.

20 ఏళ్ల క్రితం రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే.. 2 లక్షల రెట్లు20 ఏళ్ల క్రితం రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే.. 2 లక్షల రెట్లు

బౌన్స్ యాప్ ద్వారా సులభంగా పికప్‌ చేసుకోవడంతోపాటు నగరంలోని పార్కింగ్ జోన్లో ఈ వాహనాన్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. బౌన్స్ కిలో మీటరుకు రూపాయి చార్జీని వసూలు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఫౌండర్, సీటీవో వరుణ్ అగ్ని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాదులో రెండు వేల స్కూటర్లతో సేవలు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్ నాటికి 8 వేలకు పెంచుతామన్నారు.

 Bounce enters Hyderabad with dockless scooters

బౌన్స్ సంస్థ ఏడాది క్రితం బెంగళూరులో సేవలు ప్రారంభించింది. బెంగళూరులో రోజుకు 13వేల స్కూటర్ల ద్వారా లక్ష రైడ్స్ సేవలు అందిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో మరో పది నగరాలకు విస్తరించడంతో పాటు రోజుకు పది లక్షల రైడ్స్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సరికొత్త టెక్నాలజీ సొల్యూషన్‌తో తయారైన ఈ యాప్ ద్వారా బుకింగ్‌ చేసుకున్నవారికి మాత్రమే ఈ స్కూటర్ తాళం తీసుకునే అవకాశం ఉంటుంది.
అలాగే ప్రయాణం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా తాళం పడుతుంది. ఈ స్కూటర్‌ను ఎవరు దొంగలించకుండా ఉండేందుకు దీనికి GPS ట్యాగింగ్, జియో ఫెన్సింగ్, సెన్సార్ ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే అలర్ట్ రింగ్ మోగుతుంది. వ్యాపార విస్తరణకు గత జూలైలో 72 మిలియన్ డాలర్ల నిధుల్ని సేకరించింది. బౌన్స్. మరో 100 నుంచి 150 మిలియన్ డాలర్ల నిధుల్ని సేకరించే ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదుతో పాటు వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలలో బౌన్స్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ప్రతి కిలో మీటరుకు రూ.1, నిమిషానికి రూ.1.75 చొప్పున కలిసి రుసుము వసూలు చేస్తామని బౌన్స్ చెబుతోంది.

English summary

హైదరాబాద్‌లో బౌన్స్ స్కూటర్ షేరింగ్ సేవలు, కి.మీ.కు రూ.1! | Bounce enters Hyderabad with dockless scooters

Bounce, a dockless scooter sharing service, has launched 2,000 scooters in Hyderabad for first and last mile connectivity and regular commute.
Story first published: Wednesday, December 18, 2019, 13:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X