For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాడ్-లాగా మార్చేసిన బీజేపీ, idea of GST: RIP: చిదంబరం 10 పాయింట్స్...

|

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో డబ్బులు ప్రింట్ చేయాలని సూచించారు. తాజాగా జీఎస్టీ పైన ఆసక్తికర ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీని అర్ధం చేసుకోవడానికి ఇక్కడ పది పాయింట్స్ అంటూ సామాజిక అనుసంధాన వేదికలో పీ చిదంబరం పేర్కొన్నారు.

చిదంబరం చెప్పిన 10 పాయింట్స్

చిదంబరం చెప్పిన 10 పాయింట్స్

జీఎస్టీ ఓ మంచి ఉద్దేశ్యంతో ప్రారంభమైంది.

బీజేపీ దీనిని బ్యాడ్ లాగా మార్చివేసింది.

భయానక పన్ను రేటు ఉంది.

పన్నులు వసూలు చేసే అధికారులు వేటాడే వారిగా చట్టాన్ని వర్తింపచేశారు.

ప్రతి వ్యాపారవేత్తను పన్ను ఎగవేతదారుడిగా అనుమానించే పరిస్థితి.

జీఎస్టీ కౌన్సిల్‌ను ఓ మాట్లాడే షాప్ స్థాయికి తగ్గించేశారు.

జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ కమిటీ తోక ఆడించే దానిలా మారిపోయింది.

జీవోఎంను ఎన్డీయే, మద్దతు పార్టీల పొడిగింపుగా ఆర్థికమంత్రి భావిస్తున్నారు.

విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే అందరు ఆర్థికమంత్రులను తప్పుదారి పట్టిన స్కూల్ పిల్లలుగా పేర్కొంటారు.

చివరకు.. జీఎస్టీ ఐడియా.. రిప్ అని పేర్కొన్నారు.

డబ్బును ముద్రించవచ్చు

డబ్బును ముద్రించవచ్చు

ప్రభుత్వ ఖర్చులకు అవసరమైతే తగినంత కరెన్సీని కేంద్ర ప్రభుత్వం ముద్రించాలని అంతకుముందు చిదంబరం పేర్కొన్నారు. 'తప్పనిసరైతే ఖర్చుల కోసం కేంద్రం కరెన్సీ ముద్రించుకోవచ్చునని, అందుకు అవసరమైన సార్వభౌమాధికార హక్కు మనకు ఉందని, మరీ ఎక్కువగా ముద్రించేసామని ప్రభుత్వం అనుకుంటే ప్రింటింగ్ ఎప్పుడైనా నిలిపి వేయవచ్చునని చెప్పారు. ఇప్పటికిప్పుడు అయితే కరెన్సీ ప్రింట్ చేయడం సరైన చర్యగా తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఇదే ఆలోచనను డాక్టర్ అభిజిత్ బెనర్జీ కూడా వ్యక్తం చేశారన్నారు.

ఆర్థికవేత్తలదీ అదే మాట

ఆర్థికవేత్తలదీ అదే మాట

ప్రభుత్వం తమ ఖర్చులను తట్టుకునేందుకు కరెన్సీ ప్రింట్ చేయడం తప్పనిసరనే అభిప్రాయాన్ని ఇతర ఆర్థికవేత్తలు కూడా వ్యక్తం చేశారని చిదంబరం అన్నారు. '2020-21 ఆర్థిక సంవత్సరం గత 4 దశాబ్దాల్లోనే అత్యంత చీకటి సంవత్సరంగా నిలుస్తోందని, నాలుగు త్రైమాసికాల్లోని పరిస్థితి ఇందుకు అద్దం పడుతుందని, మొదటి రెండు త్రైమాసికాల్లో ఆర్థిక సంక్షోభం, మూడు, నాలుగో త్రైమాసికాల్లో కోలుకోని పరిస్థితి ఉందన్నారు.

అప్పుడే గుర్తు చేశాం

అప్పుడే గుర్తు చేశాం

గత ఏడాది కరోనా ప్రభావం తగ్గినట్లు కనిపించడంతో ఆర్థిక మంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు కె సుబ్రమణియన్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని చెప్పారని, వి-షేప్ రికవరీ ఉంటుందని చెప్పారని, అంతకుమించి చేసిందేమీ లేదన్నారు. వారు చెప్పేది కట్టు కథ అని, కోలుకునే సంకేతాలు కనిపించడం లేదని తాము అప్పుడే చెప్పామని, ఆర్థిక వ్యవస్థకు బలమైన డోస్ కావాలని చెప్పామని గుర్తు చేశారు.

English summary

బ్యాడ్-లాగా మార్చేసిన బీజేపీ, idea of GST: RIP: చిదంబరం 10 పాయింట్స్... | BJP converted GST into bad law: P Chidambaram

Former Union Finance Minister and senior Congress leader P Chidambaram on Wednesday slammed the BJP-led Centre over the issue of Goods and Services Tax (GST) and alleged it has converted the tax regime into a bad law.
Story first published: Wednesday, June 2, 2021, 14:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X