For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదరగొడుతున్న క్రిప్టో, రూ.37 లక్షలు దాటిన బిట్ కాయిన్ వ్యాల్యూ

|

కరోనా తర్వాత బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. గత రెండు నెలలుగా అయితే ఏకంగా 25వేల డాలర్ల నుండి 50వేల డాలర్లు దాటింది. తాజాగా బిట్ కాయిన్ 5 శాతం లాభపడి 50,602 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు రోజు 50,300 వద్ద ట్రేడ్ అయింది. ఈ ఏడాది ఈ క్రిప్టో కరెన్సీ 72 శాతం లాభపడింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ బిట్ కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టిన అనంతరం ఈ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ మరింత ఎగిసింది. మాస్టర్ కార్డ్, టెస్లా తదితర సంస్థలు ఎంపిక చేసిన క్రిప్టోకరెన్సీలను ఆమోదించనున్నట్లు తెలిపాయి.

LPG Cylinder Rates: 3 నెలల్లో రూ.200 పెరిగిన గ్యాస్ ధరLPG Cylinder Rates: 3 నెలల్లో రూ.200 పెరిగిన గ్యాస్ ధర

మూడు నెలల కాలంలో 200 శాతం జంప్

మూడు నెలల కాలంలో 200 శాతం జంప్

ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఒక్క బిట్ కాయిన్ వ్యాల్యూ 50,000 డాలర్లు దాటింది. భారతీయ కరెన్సీలో ఈ వ్యాల్యూ రూ.37 లక్షల కంటే ఎక్కువ. గత మూడు నెలల కాలంలో బిట్ కాయిన్ 200 శాతం లాభపడింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 70 శాతం లాభపడింది. ఏడాది క్రితం 10,000 డాలర్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఈ కరెన్సీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బిట్ కాయిన్ ర్యాలీ చేస్తోంది. అమెరికాలోని వర్జీనియాకు చెందిన బ్లూరిడ్జ్ బ్యాంకు తమ ఏటీఎంలు, శాఖల్లో బిట్ కాయిన్ కొనుగోలు చేయవచ్చునని ప్రకటించింది.

బిట్ కాయిన్ పరుగులు

బిట్ కాయిన్ పరుగులు

టెస్లా 1.5 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసింది. మాస్టర్ కార్డ్ సహా పలు సంస్థలు ఎంపిక చేసిన క్రిప్టోను అంగీకరిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ న్యూయాల్క్ మెల్లాన్ నిర్ణయం కూడా బిట్ కాయిన్‌కు అనుకూలంగా మారింది. డిజిటల్ ఆస్తుల జారీ, నిర్వహణ, బదలీలకు సంబంధించి క్లయింట్స్‌కు మద్దతుగా బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ ఇప్పటికే ఓ అంతర్గత విభాగాన్ని ఏర్పాటు చేసింది. టెస్లా, మాస్టర్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ నిర్ణయాలు బిట్ కాయిన్ వ్యాల్యూను పరుగులు పెట్టించాయి.

సొంత కరెన్సీ దిశగా భారత్

సొంత కరెన్సీ దిశగా భారత్

భారత్‌లో 75 లక్షలకు పైగా ఇన్వెస్టర్లు 100 కోట్ల డాలర్లకు పైగా క్రిప్టోకరెన్సీని కలిగి ఉన్నారని అంచనా. ఇది మన కరెన్సీలో రూ.7,300 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది.

English summary

అదరగొడుతున్న క్రిప్టో, రూ.37 లక్షలు దాటిన బిట్ కాయిన్ వ్యాల్యూ | Bitcoin vaults above dollar 50,000 for first time ever

Bitcoin rose above $50,000 on Tuesday to a new record high, building on a rally fuelled by signs that the world's biggest cryptocurrency is gaining acceptance amongst mainstream investors.
Story first published: Wednesday, February 17, 2021, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X