For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటిసారి 60,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్ వ్యాల్యూ

|

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ దూకుడు కొనసాగుతోంది. బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. శ‌నివారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 60,000 డాలర్లు క్రాస్ చేసింది. డిజిట‌ల్ క‌రెన్సీ మార్కెట్లో కింగ్‌గా ఉన్న బిట్ కాయిన్ ఆల్ టైమ్ రికార్డ్ ఇదే. మూడు వారాల క్రితం 58వేల డాలర్లను దాటి, చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 45వేల డాలర్ల దిగువకు పతనమైంది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. గ‌త నెల 21వ తేదీన 58,354 డాల‌ర్ల‌ వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకి, ఇప్పుడు దానిని క్రాస్ చేసింది. గ‌త నెల నుంచి బిట్ కాయిన్ వ్యాల్యూ రెండు శాతానికి పైగా వృద్ధి నమోదు చేసింది.

వెయ్యి శాతం జంప్

వెయ్యి శాతం జంప్

డాల‌ర్ బ‌ల‌హీనప‌డటంతోపాటు ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిన‌ప్పుడు ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి మార్గంగా ఉన్న బంగారానికి ఈ క్రిప్టోకరెన్సీ ప్రత్యామ్నాయంగా మారిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా బిట్ కాయిన్‌ను మరో బంగారంగా భావిస్తున్నారు. ఈ ప్రభావం బంగారంపై కూడా ప్రభావం చూపింది. క్లిష్ట పరిస్థితుల్లో రిక‌వ‌రీ సాధించే స‌త్తా బిట్ కాయిన్‌కు ఉందని చెబుతున్నారు. గ‌త ఏడాది కాలంలో బిట్ కాయిన్ వ్యాల్యూ దాదాపు వెయ్యి శాతం వరకు పెరిగింది.

అందుకే బిట్ కాయిన్ జంప్

అందుకే బిట్ కాయిన్ జంప్

క్రిప్టో క్రెడిట్ కార్డ్ జెయింట్ మాస్ట‌ర్ కార్డుతో పాటు వీసా, ఆన్‌లైన్ పేమెంట్స్ సంస్థ పేపాల్‌, బ్లాక్‌రాక్ ఇంక్ అసెట్ మేనేజ‌ర్ BNY మెల్లొన్, మైక్రోస్ట్రాట‌ర్జీ ఇంక్, ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్ మ‌స్క్ త‌దిత‌ర కార్పొరేట్లు అండగా నిల‌బ‌డ‌టంతో బిట్ కాయిన్ వ్యాల్యూ రోజురోజుకు పెరిగిపోతోంది. క‌రోనా కారణంగా కుదేలైన ఆర్థికవ్య‌వ‌స్థ‌కు పునరుత్తేజం ఇచ్చేందుకు జోబిడెన్ ప్ర‌క‌టించిన 1.9 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ప్యాకేజీ బిట్ కాయిన్ వ్యాల్యూ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్

బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్

బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవలే తిరిగి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఫిబ్రవరి తర్వాత ఈ నెలలో మొదటిసారి బిట్‌కాయిన్ 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటింది.

ఫిబ్రవరి నెలలో అమెరికాలో కన్స్యూమర్ ధరలు అంచనాల కంటే తక్కువ పెరిగాయి. బిట్ కాయిన్ ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎథెర్ రెండో స్థానంలో ఉంది. ఎథెర్ క్రిప్టో ఇటీవల 3 శాతం మేర పెరిగింది. బిట్ కాయిన్ (BTC), ఎథెరియమ్ (ETH)తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కార్డానో (ADA), పోల్కాడాట్ (DOT), XRP (XRP), యూనిస్వాప్ (UNI) కూడా సానుకూలంగా ఉన్నాయి.

English summary

మొదటిసారి 60,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్ వ్యాల్యూ | Bitcoin hits $60,000 in record high

Bitcoin, the world's biggest cryptocurrency, on Saturday crossed a record high of $60,000. Bitcoin has risen sharply this year, broadly outperforming conventional asset classes, partly due to broader acceptance as a form of payment.
Story first published: Sunday, March 14, 2021, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X