గోల్డ్‌మన్ శాక్స్ ఎఫెక్ట్, మళ్లీ బిట్ కాయిన్ జంప్: 25 శాతం కరెక్షన్!
అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మాన్ శాక్స్ గ్రూప్ ఇంక్ తాజాగా క్రిప్టో డెస్క్‌ను పునఃప్రారంభించిన నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యు పుంజుకుంది. బిట్ కాయిన్ వ్యాల్యూ నిన్న 52,500 డాలర్లు దాటింది. ఇంగ్లీష్ మీడియా కథనం ప్రకారం గోల్డ్‌మన్ శాక్స్ తన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ డెస్క్‌ను ప్రారంభించింది. వచ్చే వారం నుండి ఖాతాదారులకు బిట్ కాయిన్ ఫ్యూచర్స్, నాన్-డెలివరబుల్ ఫార్వార్డ్స్‌ను ప్రారంభిస్తుంది. అమెరికాకు చెందిన ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, సిటీ గ్రూప్ నుండి వచ్చిన ఎండార్స్‌మెంట్ నేపథ్యంలో ఈ డెవలప్‌మెంట్ చోటు చేసుకుంది.
GST పరిధిలోకి వస్తే పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.68! కానీ నేతలు సిద్ధంగా లేరు

బిట్ కాయిన్ మళ్లీ
బిట్ కాయిన్ తిరిగి మళ్లీ క్రమంగా పుంజుకోవడం ప్రారంభించిందని, ఫిడెలిటీకి చెందిన ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ బిట్ కాయిన్‌ను బంగారంతో పోల్చారని క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాం కాయిన్‌స్విచ్ కుబేర్ సీఈవో అండ్ కో-ఫౌండర్ ఆశిష్ సింఘాల్ తెలిపారు. గోల్డ్‌మన్ శాక్స్ దాదాపు మూడేళ్ల తర్వాత తన క్రిప్టో ట్రేడింగ్ డెస్క్‌ను ప్రారంభించిందని తెలిపారు. బిట్ కాయిన్ కలిగిన వారికి క్రమంగా రిటర్న్స్ బాగుండేలా ఉందని చెబుతున్నారు.

క్రిప్టోకు ప్రాధాన్యత
మున్ముందు భవిష్యత్తు క్రిప్టోకరెన్సీదిగా చాలామంది భావిస్తున్నారు. క్రిప్టోకు డిమాండ్ పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంత క్రిప్టోను తీసుకు వచ్చే ఆలోచన చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఇందులో బిట్ కాయిన్ వాటానే అధికం. భవిష్యత్తు డిజిటల్ మనీకి ఉందని, అందులోను బిట్ కాయిన్‌కు సమీప భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు.