For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ భారీ పతనం: 20 శాతం డౌన్, ఒక్కరోజులోనే 14 శాతం

|

గత ఏడాది భారీగా ఎగిసిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ కొత్త సంవత్సరంలో పడిపోయింది. సోమవారం బిట్ కాయిన్‌కు బ్లాక్ మండే. ఇంతకుముందు రికార్డ్ స్థాయిలో 34,800 డాలర్లకు (రూ.25.4 లక్షలు) చేరుకున్న బిట్ కాయిన్ తన గ్రౌండ్‌ను కోల్పోయింది. కొత్త ఏడాదిలో 33,670 డాలర్ల (రూ.24.6 లక్షలు) పైకి చేరుకున్న బిట్ కాయిన్ సోమవారం 14 శాతం మేర పతనమైంది. ఆదివారం నమోదయిన 34800 డాలర్లను పరిగణలోకి తీసుకుంటే 20 శాతం పతనమైంది. అంతకుముందు 9 శాతం పతనమై 30,077 డాలర్లు(రూ.21.9 లక్షలు) వద్ద స్థిరపడింది.

భారీగా ఎగిసి..

భారీగా ఎగిసి..

2017లో అంతకంతకూ పెరుగుతున్న ఈ క్రిప్టో కరెస్సీ బిట్ కాయిన్ మూడు వారాల క్రితం డిసెంబర్ 16న మొదటిసారి 20 వేలడాలర్లను (రూ.14.6 లక్షలు) తాకింది. ఆ తర్వాత రికార్డుస్థాయిలో దూసుకెళ్లింది. గత ఏడాదితో పోలిస్తే బిట్ కాయిన్ విలువ నాలుగు రెట్లు పెరిగింది. అయితే సోమవారం అనూహ్యంగా 14 శాతం పడిపోయింది. బిట్ కాయిన్ మరికొద్దిరోజులు అస్పష్టంగానే ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

డిసెంబర్ చివరి వారంలో జంప్

డిసెంబర్ చివరి వారంలో జంప్

వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్ 2020 క్యాలెండర్ ఏడాదిలో జంప్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ చివరి వారంలో అంతకంతకూ పెరిగింది. డిసెంబర్ 25న 25వేల డాలర్లు పలికిన బిట్ కాయిన్, ఆ తర్వాత రోజు 26వేలు, 27న 27వేల డాలర్లుగా నమోదయింది. గత మార్చి నెలలో 5000 డాలర్లు పలికిన బిట్ కాయిన్ ఇప్పుడు 30వేల పైకి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50వేల కోట్ల డాలర్ల వరకు ఉంది.

మంచి రిటర్న్స్

మంచి రిటర్న్స్

గత కొంతకాలంగా బిట్ కాయిన్స్ మంచి రిటర్న్స్ అందిస్తోంది. ఈ క్రిప్టోకరెన్సీ కొనుగోలుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఓ దశలో 1,500 డాలర్ల స్థాయికి పడిపోయిన బిట్ కాయిన్ వ్యాల్యూ ఇప్పుడు 30 వేల డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. త్వరలో 35 వేల డాలర్లకు చేరుకోనుందని, ఈ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ 2030 నాటికి రూ.కోటి(1,35,00 డాలర్లు)కి చేరుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

English summary

బిట్ కాయిన్ భారీ పతనం: 20 శాతం డౌన్, ఒక్కరోజులోనే 14 శాతం | Bitcoin Falls Over 14 Percent in a Day to Around 30,000 dollars

Bitcoin fell sharply on Monday, losing ground from a record high of $34,800 (roughly Rs. 25.4 lakhs) touched a day earlier, with traders citing volatility in highly leveraged futures markets.
Story first published: Tuesday, January 5, 2021, 9:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X