భారీగా పతనమైన బిట్ కాయిన్, టాప్ లూజర్స్ ఇవే
రెండు రోజుల పాటు కాస్త లాభాల్లో కనిపించిన క్రిప్టో కరెన్సీ ఈ రోజు (మే 24, మంగళవారం) భారీగా పతనమైంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియంలు గత ఇరవై నాలుగు గంటల్లో 4 శాతం నుండి 6 శాతం మేర క్షీణించాయి. టాప్ క్రిప్టోల్లో లూనా అత్యధికంగా 16 శాతం, అవాలాంచె 12 శాతం నష్టపోయాయి. కార్డానో దాదాపు 8 శాతం నష్టపోయింది. బిట్ కాయిన్ నిన్న 30,000 డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఇప్పుడు 29,000 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ దాదాపు 4 శాతం క్షీణించి 28,997 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 28,641 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 30,484 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 553.59 బిలియన్ డాలర్లు క్షీణించింది. గత 52 వారాల్లో బిట్ కాయిన్ గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 25,402.04 డాలర్లు. వివిధ క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 4 శాతం, ఎథేరియం 6 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 5.8 శాతం, సోలానా 9 శాతం, బియాన్స్ కాయిన్ 0.01 శాతం, క్రిప్టో డాట్ కామ్ 7.51 శాతం, కార్డానో 7.56 శాతం, స్టెల్లార్ 7.01 శాతం, పోల్కాడాట్ 5.99 శాతం, అవాలాంచె 12.20 శాతం, డోజీకాయిన్ 5.77 శాతం, వ్రాప్డ్ బిట్ కాయిన్ 4 శాతం, షిబా ఇను 5.64 శాతం క్షీణించాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఆల్కెమీ పే 8.37 శాతం, ట్రోన్ 4.93 శాతం, టెర్రా యూఎస్డీ 3.21 శాతం, టెజోస్ 0.78 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఔగుర్ ఏకంగా 20 శాతం పడిపోయింది. ఆ తర్వాత కైబర్ నెట్ వర్క్ 16 శాతం, రిక్వెస్ట్ 15 శాతం, లూనా 15 శాతం, న్యూసైఫెర్ 15 శాతం క్షీణించాయి.