ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 16 నుండి 21వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి మూడు రోజుల సేల్‌తో 70 మందికి పైగా వ్యాపారులు కోటీశ్వరులు, 10,000కు పైగా వ్యాపారులు లక్షాధిపతులు అయినట్లు తెలిపింది. 3,00,000 మంది అమ్మకందారులకు ఆర్డర్లు లభించాయని, ఇందులో 60 శాతం మంది టైర్ 2 నగరాలకు చెందినవారని తెలిపింది.
వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ ఈ ఏడాది 20 శాతం పెరిగి 3,000 పిన్‌కోడ్‌లకు చేరుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆరు రోజుల్లో ఉన్న సేల్స్ ఈసారి రెండు రోజుల్లో చూసినట్లు తెలిపింది.

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్..
బిగ్ బిలియన్ డే సేల్ మూడు రోజుల్లో ప్లాట్‌ఫాంలోని సెల్లర్స్‌కు మంచి బిజినెస్ వచ్చిందని, మొదటి మూడు రోజుల్లో మూడు లక్షల మందికి పైగా విక్రేతలకు ఆర్డర్లు వచ్చాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. మొదటి మూడు రోజుల్లో ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పే లెటర్ ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉందని తెలిపింది.
ఈ ఏడాది అత్యవసరమైన ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడిందని పేర్కొంది. గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయని వెల్లడించింది. సాధారణ రోజులతో పోల్చితే పండుగ సీజన్‌లో డిజిటల్ చెల్లింపుల ట్రాన్సాక్షన్స్ 60 శాతం పెరిగాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఆన్ లైన్ షాపింగ్ కోసం మొగ్గు చూపారు.

టైర్ 2, టైర్ 3ల్లో పెరిగిన సేల్స్
సేల్ ప్రారంభించిన 48 గంటల్లో అమెజాన్ 5,000 మందికి పైగా సెల్లర్స్ రూ.10 లక్షల సేల్స్ నమోదు చేశారు. ఇందులో ఆర్డర్స్ పొందిన సెల్లర్స్‌లో 66 శాతం టైర్ -II, టైర్-III నగరాలకు చెందినవారని తెలిపింది. 1.1 లక్షలకు పైగా సెల్లర్స్ ఆర్డర్లు స్వీకరిస్తున్నారని తెలిపింది. చిన్న పట్టణాల నుండి 66 శాతం సెల్లర్స్, 91 శాతం మంది కొత్త కస్టమర్లు, 66 శాతం మంది కొత్త ప్రైమ్ సైనప్స్ ఉన్నట్లు తెలిపింది. 5 భాషల్లో షాపింగ్ నిర్వహిస్తున్నారని తెలిపింది.

అమెజాన్, స్నాప్ డీల్‌లోను టైర్ 2, టైర్ 3 నగరాల్లో..
ఇదిలా ఉండగా, అమెజాన్ ఇండియా మొదటి 48 గంటల్లో 1.1 లక్షల ఆర్డర్స్ పొందింది. స్నాప్ డీల్ అందుకున్న ఆర్డర్లలో 65 శాతం మెట్రోపాలిటన్ కానీ ప్రాంతాల నుండి ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో 35 శాతం ఆర్డర్స్ పొందింది. ఇటీవలి కాలంలో మెట్రో సిటీల కంటే టైర్ 1, టైర్ 2 కంటే నగరాల్లో సేల్స్ పెరిగినట్లు ఆన్‌లైన్ దిగ్గజాలు వెల్లడిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications