పెట్రోల్ ధరల పెరుగుదల, జీఎస్టీ రూల్స్: భారత్ 'వ్యాపార్' బంద్
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లింగ్‌కు నిరసనగా అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య(CIAT) శుక్రవారం దేశవ్యాప్త భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఎనిమిది కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిథ్యం వహిస్తోన్న 40,000 సంఘాలు ఈ భారత్ బంద్‌లో పాల్గొంటున్నట్లు CIAT ప్రతినిధులు తెలిపారు.
కోటిమంది వరకు ఉన్న లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం ఈ బంద్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపాయి. అయితే కొన్ని సంఘాలు బంద్‌కు మద్దతివ్వడం లేదు. జీఎస్టీ లక్ష్యాల నుండి పక్కకు మరలిందని, నిబంధనలు సరికాదని, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యాపారులకు కష్టంగా మారిందని, దీనిని ఇవ్వకపోవడంతో అదనంగా ఆర్థిక భారం పడుతోందని వ్యాపార సంఘాలు వెల్లడిస్తున్నాయి.

CIAT ఇచ్చిన బంద్ పిలుపుకు మిశ్రమ స్పందన లభించింది. పెట్రోల్ ధరలు తగ్గించకుంటే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. కాగా, దీనిని భారత్ వ్యాపార బంద్‌గా చెబుతున్నారు.