For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ సీఈవో బాధ్యత నుండి తప్పుకున్నప్పటికీ... ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోసే

|

జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవో బాధ్యతల నుండి తప్పుకొని, ఆండీ జాస్సీకి అప్పగించారు. అమెజాన్ అత్యున్నత పదవి వదిలినప్పటికీ ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన కుబేరుడిగా ఆయనే నిలిచారు. ఫోర్బ్స్-ది వరల్డ్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్‌లో అతనికి మొదటి స్థానం దక్కింది. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం అతని సంపద 203 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. జెఫ్ బెజోస్ 1994లో అమెజాన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవలి కాలంలో అమెజాన్ స్టాక్స్ భారీగా జంప్ చేయడంతో అతని ఆస్తులు కూడా అమాంతం పెరిగాయి.

200 బిలియన్ డాలర్ల కుబేరుడు

200 బిలియన్ డాలర్ల కుబేరుడు

1995లో అమెజాన్ పేరిట పుస్తకాలు విక్రయించేందుకు ఓ చిన్న ఆన్‌లైన్ సంస్థను స్థాపించిన జెఫ్ బెజోస్ దానిని అంచెలంచెలుగా వృద్ధిలోకి తెచ్చి, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా నిలబెట్టారు. నిన్ననే అమెజాన్‌లో 1997లో చేరిన ఆండీ జాస్సీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

2003లో అమెజాన్ వెబ్ సిరీస్ ప్రారంభమైనప్పటి నుండి 2016 వరకు ఆ బాధ్యతలు చూసుకున్నారు జాసీ. ఇప్పుడు అమెజాన్ అత్యున్నత పదవిని అలంకరించారు. మరోవైపు ఇప్పుడు జెఫ్ బెజోస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, కంపెనీలో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఉంటున్నారు. 200 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మొదటి వ్యక్తి ఇతనే.

బెజోస్ తర్వాత మస్క్

బెజోస్ తర్వాత మస్క్

జెఫ్ బెజోస్ 203 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. 186 బిలియన్ డాలర్లతో టెస్లా ఇంక్ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. వీరి కంపెనీల షేర్ల కదలికను బట్టి వీరి సంపద వ్యాల్యూ మారుతుంది. తనకు జూలై 5 సెంటిమెంట్ అని, అందుకే ఆ రోజున బాధ్యతల నుండి తప్పుకున్నట్లు తెలిపారు.

చివరిసారి 81,840 డాలర్ల వేతనం

చివరిసారి 81,840 డాలర్ల వేతనం

అమెజాన్ సీఈవోగా జెఫ్ బెజోస్ గత ఏడాది 81,840 డాలర్ల వేతనం అందుకున్నారు. ఇతర కంపెన్షేషన్ రూపంలో 1.6 మిలియన్ డాలర్లు తీసుకున్నారు. ఇతని సంపద పలు దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. ఇతను అమెరికాలో కొన్నిసార్లు పన్నులు కూడా చెల్లించలేదు. 2007లోనే అతను బిలియనీర్. ఆ సమయంలో పన్ను చెల్లించలేదు.

English summary

అమెజాన్ సీఈవో బాధ్యత నుండి తప్పుకున్నప్పటికీ... ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోసే | Bezos Still World's Richest Man With $203 Billion after stepping down

Even after stepping down as the CEO of Amazon, Jeff Bezos remains at the top of the Forbes The World’s Real-Time Billionaires list, as he holds onto the number one position with an iron grip.
Story first published: Tuesday, July 6, 2021, 17:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X