For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 రోజుల్లో 5 బిలియన్ డాలర్ల స్టాక్స్ విక్రయించిన జెఫ్ బెజోస్

|

జెఫ్ బెజోస్ తన అమెజాన్ డాట్ కామ్ ఇంక్‌కు చెందిన 2.4 బిలియన్ స్టాక్స్‌ను విక్రయించాడు. దీంతో అతని గతవారం వరకు విక్రయించిన మొత్తం 5 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌లో ఫైలింగ్ చేసిన ప్రకారం ప్రీ-అరేంజ్డ్ ట్రేడింగ్ ప్లాన్ కింద బెజోస్ 739,032 షేర్లను విక్రయించాడు. అంతేకాదు మరో 2 మిలియన్ల షేర్లను విక్రయిస్తానని కూడా అతను ఫైలింగ్‌లో తెలిపారు. ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్‌కు అమెజాన్‌లో 10 శాతం కంటే పైగా వాటా ఉంది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతని సంపద 192.1 బిలియన్ డాలర్లు.

వాటాల విక్రయం

వాటాల విక్రయం

1997లో అమెజాన్ పబ్లిక్‌లోకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత కాలంలో దాదాపు జెఫ్ బెజోస్ ఆన్‌లైన్ రిటైలర్‌లో ఐదో వంతును దాదాపు 2 బిలియన్ డాలర్ల మేరకు విక్రయించారు. ఇటీవలి కాలంలో బెజోస్ వాటా మరింతగా పెరిగింది. గత ఏడాది అతను గత ఏడాది అతను 10 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించాడు. అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ తన రాకెట్ కంపెనీ బ్లూ ఆరిజిన్ కోసం గత కొద్ది కాలంగా అమెజాన్‌లోని తన వాటాలను విక్రయిస్తున్నాడు.

76 శాతం జంప్

76 శాతం జంప్

గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ఉధృతమవుతోన్న విషయం తెలిసిందే. ఈ కాలంలో అమెజాన్ స్టాక్ 76 శాతానికి పైగా ఎగిసింది. కరోనా సమయంలో ప్రజలంతా ఆన్ లైన్ షాపింగ్‌కు మరింతగా అలవాటు పడ్డారు. బయటకు వెళ్లేందుకు భయపడుతూ ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఈ స్టాక్ 1.1 శాతం ఎగిసిపడింది. బెజోస్ అమెజాన్ వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని బెజోస్ ఎర్త్ ఫండ్‌కు కూడా వినియోగిస్తున్నారు.

నాలుగు రోజుల్లో 5 బిలియన్ డాలర్లు

నాలుగు రోజుల్లో 5 బిలియన్ డాలర్లు

జెఫ్ బెజోస్ కేవలం నాలుగు రోజుల్లోనే 5 బిలియన్ డాలర్ల స్టాక్స్ విక్రయించారు. ఇటీవల చివరిసారి 2.4 బిలియన్ డాలర్లు విక్రయించారు. అమెజాన్ ఈ స్థాయికి రావడానికి జెఫ్ బెజోస్‌కు జెఫ్ విల్కే కూడా సహకరించారు. అతను ఇటీవలి కాలంలో బయటకు వెళ్లారు.

English summary

4 రోజుల్లో 5 బిలియన్ డాలర్ల స్టాక్స్ విక్రయించిన జెఫ్ బెజోస్ | Bezos sells 2.4 billion dollar of Amazon in second wave this week

Jeff Bezos sold $2.4 billion of Amazon.com Inc. stock, bringing the amount he’s unloaded this week to almost $5 billion.
Story first published: Sunday, May 9, 2021, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X