ఈ మధ్య మ్యూచవల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరిగాయి. అయితే చాలా మంది ఏ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో స్మాల్ క్యాప్ మ్యూచవల్ ఫండ్స్ లో రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే రిస్క్ ఎంత ఎక్కువ ఉంటుందో రాబడి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రాబడి ఇస్తున్న స్మాల్ క్యాప్ మ్యూచవల్ ఫండ్స్ ఏమిటో చూద్దాం..

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఐదు సంవత్సరాల కాలానికి 30 శాతం రాబడి ఇచ్చింది. మూడు సంవత్సరాల కాలానికి 47 శాతం రిటర్ట్స్ ఇచ్చింది. ప్రస్తుతం దీని ఎన్ఏవీ రూ.120 గా ఉంది. దీని ఎక్స్ పెన్స్ రేషియో 0.62% గా ఉంది.

కోటక్ స్మాల్ క్యాప్
కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 3 సంవత్సరాలలో 34 శాతం, ఐదు సంవత్సరాలకు 24 శాతం రాబడి ఇచ్చింది. ప్రస్తుతం దీని ఎన్ఏవీ రూ.166 గా ఉంది. దీని ఎక్స్ పెన్స్ రేషియో 0.49% ఉంది.

యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్
యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 5 సంవత్సరాల కాలానికి 23 శాతం, మూడు సంవత్సరాలకు 28 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతం దీని ఎన్ఏవీ రూ.62 గా ఉంది. దీని ఎక్స్ పెన్స్ రేషియో 0.48% ఉంది.

నిప్పన్ స్మాల్ క్యాప్ ఫండ్
నిప్పన్ స్మాల్ క్యాప్ ఫండ్ మూడు సంవత్సరాలకు 34 శాతం, ఐదు సంవత్సరాల కాలానికి 22 శాతం రాబడి ఇచ్చింది. ప్రస్తుతం దీని ఎన్ఏవీ రూ. 85 గా ఉంది. దీని ఎక్స్ పెన్స్ రేషియో 1.03% ఉంది.

ఐసీఐసీఐ ప్రోడెన్షయల్ స్మాల్ క్యాప్ ఫండ్
ఐసీఐసీఐ ప్రోడెన్షయల్ స్మాల్ క్యాప్ ఫండ్ ఐదు సంవత్సరాలకు 22 శాతం, మూడు సంవత్సరాలకు 33 శాతం రిటర్న్స్ ఇస్తోంది. ప్రస్తుతం దీని ఎన్ఏవీ రూ.52 గా ఉంది. దీని ఎక్స్ పెన్స్ రేషియో 0.71% ఉంది.

ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్
ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 5 సంవత్సరాలకు 20 శాతం, 3 సంవత్సరాలకు 27 శాతం రాబడి ఇస్తోంది. ప్రస్తుతం దీని ఎన్ఏవీ రూ.107 గా ఉంది. దీని ఎక్స్ పెన్స్ రేషియో గా ఉంది. ప్రస్తుతం దీని ఎన్ఏవీ రూ. గా ఉంది. దీని ఎక్స్ పెన్స్ రేషియో 0.76% ఉంది.
Note: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే నిపుణులను సంప్రదించి పెట్టుబడి పెట్టగలరు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications